Begin typing your search above and press return to search.
లిల్లీకి కామ్రేడ్ అండ
By: Tupaki Desk | 15 July 2019 6:56 AM GMTస్టార్ల గురించి వాళ్ళ సినిమా విశేషాల కంటే వ్యక్తిగత విషయాల మీద మీడియా ఎక్కువ ఆసక్తి చూపడం ఒకోసారి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. తామడిగే ప్రశ్నలు వాళ్లకు ఎలాంటి ఫీలింగ్స్ కలిగిస్తాయన్న కామన్ సెన్స్ కూడా ఒకోసారి వీళ్ళలో లోపిస్తు ఉంటుంది. కన్నడ జర్నలిస్టులు ఇలాంటిదే చేశారు. డియర్ కామ్రేడ్ ప్రమోషన్లో భాగంగా నార్త్ మొత్తం రౌండ్ లు వేస్తున్న టీమ్ కు బెంగుళూరులో జరిగిన ప్రెస్ మీట్ లో కొందరు ఉద్దేశపూర్వకంగా రష్మిక మాజీ లవర్ రక్షిత్ శెట్టి ప్రస్తావన తీసుకురావడం కొంత ప్రతికూలమైన వాతావరణాన్ని సృష్టించింది.
రక్షిత్ తో మీ పాత లైఫ్ పట్ల ఎలా ఫీలవుతున్నారు అన్న ప్రశ్నకు రష్మిక తరఫున విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ ఇది కేవలం సినిమాకు సంబందించిన ప్రమోషన్ అని అనవసర విషయాలు ఇక్కడ ప్రస్తావించి పక్కదారి పట్టించకండి అంటూ సవినయంగానే అడుగుతూ చురకలు వేశాడు. గీత గోవిందం టైంలోనే రష్మిక తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం అప్పుడు శాండల్ వుడ్ లో సెన్సేషన్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీలో మొదలైన వీళ్ళ పరిచయం రష్మిక తెలుగు సినిమాల్లోకి వచ్చాక బ్రేక్ అప్ అయ్యింది.
దానికన్నా ముందు ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. అన్ని తెలిసే కన్నడ మీడియా ఇలాంటి క్వశ్చన్స్ అడగటం సబబు కాదు. రష్మిక సైతం సున్నితంగా బదులు చెబుతూ భవిష్యత్తులో రక్షిత్ తో కలిసి పనిచేసే అవకాశం వస్తే చూద్దాం అని చెప్పిందే తప్ప లేదు కాదు అని చెప్పలేదు. అసలు విషయం కంటే కొసరు మ్యాటర్ల మీదే ఎక్కువ దృష్టి పెట్టే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు స్మార్ట్ గానే వ్యవహరించాలి. విజయ్ రష్మికలు ఇద్దరూ దాన్ని కరెక్ట్ గానే ప్రెజెంట్ చేశారు