Begin typing your search above and press return to search.

అమర్ ని గుద్దేసిన టాక్సీ!

By:  Tupaki Desk   |   17 Nov 2018 2:30 PM GMT
అమర్ ని గుద్దేసిన టాక్సీ!
X
అనుకున్నంతా అయ్యింది. విజయ్ దేవరకొండతో రవితేజ క్లాష్ ఎలాంటి ఫలితం ఇస్తుందో భయపడినట్టుగానే అమర్ అక్బర్ అంటోనీ-టాక్సీ వాలాలో ఎవరు క్లియర్ విన్నరో తేలిపోయింది. ఉదయం నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సరైన సినిమా లేక అల్లాడుతున్న టాలీవుడ్ ప్రేమికులు ఛలో అంటూ విజయ్ కే ఓటు వేస్తున్నారు. వీకెండ్ రెండు రోజులే ఉన్నప్పటికీ మొత్తం విజయ్ ఫేవర్ లోనే మారబోతోంది. అమర్ అక్బర్ అంటోనీ టాక్సీ కి గుద్దుకుని అప్పడం అయిపోయింది. టాక్ ఎక్కడా రికవర్ అయ్యే అవకాశం కనిపించకపోవడంతో టీం సోషల్ మీడియాలో సైతం ఏం మాట్లాడ్డం లేదు.

ఇక టాక్సీ వాలా విషయానికి వస్తే మరీ గీత గోవిందం-అర్జున్ రెడ్డి రేంజ్ లో భీభత్సమైన టాక్ రాలేదు కాని ఉన్నంతలో డీసెంట్ హారర్ ఎంటర్ టైనర్ అనే ఫీడ్ బ్యాక్ రావడంతో మౌత్ పబ్లిసిటీ బాగా హెల్ప్ అయ్యేలా ఉంది. నోటాతో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు బెటర్ గా ఉండటం మరో ప్లస్ పాయింట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు పైరసీకి భయపడకుండా వచ్చిన టాక్సీవాలా సెంటిమెంట్ ని మరోసారి నిజం చేసేలా కనిపిస్తోంది. మరో పది రోజుల దాకా రన్ కు ఎలాంటి సమస్యా లేదు. 2.0 వచ్చాక బ్రేకులు పడటం ఖాయమే అయినప్పటికీ జరిగిన బిజినెస్ కి అప్పటి దాకా హౌస్ ఫుల్స్ ని మేనేజ్ చేస్తే చాలు టాక్సీ వాలా ఈజీగా ప్రాఫిట్ జోన్ లోకి ప్రవేశిస్తుంది.

హారర్ జానర్ అయినప్పటికీ ఎంటర్ టైన్మెంట్ కి లోటు లేకపోవడంతో జనాలు బుకింగ్స్ వైపు మళ్లుతున్నారు. ఏ రేంజ్ హిట్ అనేది చెప్పడం తొందరపాటు అవుతుంది కాబట్టి సోమ మంగళవారాల్లో వచ్చే వసూళ్లను బట్టి ఒక క్లారిటీ కి రావొచ్చు. మొత్తానికి టాక్సీవాలా నెగటివ్ బజ్ మధ్య విడుదలై పాజిటివ్ గా దూసుకుపోవడం విశేషమే