Begin typing your search above and press return to search.
దేవరకొండ సెంచరీ అభివాదం అదిరింది
By: Tupaki Desk | 1 Sep 2018 8:27 AM GMTరొటీన్ కు భిన్నంగా నటించడం.. మాట్లాడటంతోనే విజయ్ దేవరకొండ చాలా వేగంగా స్టార్ గా ఎదిగిపోయాడు. అతడి ట్వీట్లు సైతం చాలా బోల్డ్ గా.. వెరైటీగా ఉంటాయి. ‘అర్జున్ రెడ్డి’ విడుదలకు ముందు ఈ చిత్రాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును ఉద్దేశించి ‘చిల్ తాతా’ అన్న కామెంట్ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో వెరైటీ ట్వీట్లతో జనాల దృష్టిని ఆకర్షించాడు విజయ్. తాగాజా తన కొత్త సినిమా ‘గీత గోవిందం’ వసూళ్ల వర్షం కురిపిస్తూ వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరిన నేపథ్యంలో విజయ్ ఆసక్తికరమైన ట్వీట్ పెట్టాడు. క్రికెట్లో ఒక ఆటగాడు సెంచరీ కొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకుంటూ వ్యాఖ్యాతతో మాట్లాడేటపుడు ఎలా మాట్లాడతాడో ఆ తరహాలో ట్వీట్ చేశాడతను.
‘‘ది బాయ్స్ ప్లేయ్డ్ వెల్’’ అంటూ మొదలుపెట్టి తన కోచింగ్ స్టాఫ్ అయిన గీతా ఆర్ట్స్.. కెప్టెన్ బుజ్జిలకు.. అలాగే తనతో మంచి పార్టనర్ షిప్ నమోదు చేసిన రష్మిక మందన్నాలకు అంకితమిస్తున్నట్లు విజయ్ చెప్పాడు. అలాగే అమేజింగ్ క్రౌడ్ అంటూ తెలుగుతో పాటు తమిళం.. కన్నడ.. మలయాళ ప్రేక్షకుల్ని పొగిడాడు విజయ్. స్వయంగా క్రికెటర్ అయిన విజయ్.. అచ్చం ఒక క్రికెటర్ మాటల్ని తలపిస్తూ తన విజయం గురించి ఇలా ట్వీట్ చేయడం అతడిని అనుసరించే యువ ప్రేక్షకులకు భలేగా కనెక్టయింది. ఈ రోజుల్లో హీరోలు మడికట్టుకుని కూర్చుంటే నడవదు. తమను తాము సరిగ్గా ప్రమోట్ చేసుకోవడం కీలకం. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఏడాది పాటు తన కొత్త సినిమా రాకపోయినా విజయ్ క్రేజ్ పడిపోకుండా చూసుకున్నాడంటే తనదైన శైలిలో అభిమానులతో ఎంగేజ్ కావడమే కారణం. ఈ విషయంలో మిగతా హీరోలు అతడి నుంచి పాఠాలు నేర్వాల్సిందే.