Begin typing your search above and press return to search.
నాని సన్ రైజర్స్ టీమ్ కి ఆడొచ్చు!
By: Tupaki Desk | 22 April 2019 4:55 AM GMTనేచురల్ స్టార్ నాని నటించిన `జెర్సీ` చిత్రం అనూహ్య విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. నాని టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ కి ఇండస్ట్రీ స్టార్స్ అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `జెర్సీ`ని ఆకాశానికి ఎత్తేశారు. నటుడిగా నాని మరో అద్భుతమైన చిత్రాన్ని అందించాడని కొనియాడారు. అయితే ఇందుకు భిన్నంగా టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ స్పందించడం ఆసక్తికరంగా మారింది.
`జెర్సీ` చూస్తుంటే నానిపై ఎంతో ప్రేమ ఏర్పడింది. క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని అందరిచేత క్లాప్స్ కొట్టించారు. సినిమాలో ప్రతీ ఒక్కరూ లీనమయ్యేలా చేశారు. `హిట్` బ్యాటింగ్ తో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. గౌతమ్ తిన్ననూరి టాలెంటెడ్ అనడానికి ఈ సినిమా చాలు. `జెర్సీ` ప్రేమలో ఓ గమనిక.. నాని హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కి ఆడొచ్చు. స్ట్రైకింగ్ అదరగొట్టేశాడు` అంటూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింద.ఈ ట్వీట్ ని 15 వేల మందికి పైగా రీట్వీట్ చేయగా 11 వేల మందికి పైగా లైక్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.
దేవరకొండ పొగడ్త మాటేమో కానీ.. సినిమా చూసిన ఆడియెన్ ఫీలింగ్ కూడా అదే. కొడితే సిక్సర్ లేదా బౌండరీ కన్ఫామ్. ఎంత యారొగెంట్ బిహేవియర్ తో ఉంటాడో అంత గొప్ప ప్లేయర్. అలాంటి క్యారెక్టర్లు స్పోర్ట్స్ లో చాలానే తగుల్తుంటాయి కోచ్ లకు. పట్టుదల విషయంలో ఎం.ఎస్.ధోనీనే తలపించింది ఆ పాత్ర. రానున్న వరల్డ్ కప్ మ్యాచ్ లకు నానీ లాంటి ప్లేయర్ కావాల్సిందే. ఇక జెర్సీ సక్సెస్ కిక్కును ఆస్వాధిస్తున్న నాని తదుపరి చిత్రంపై ఫోకస్ ప్రారంభించనున్నాడని తెలుస్తోంది.