Begin typing your search above and press return to search.

ప్రేమ కోసం విజయ్ పోరాటం!!

By:  Tupaki Desk   |   9 May 2017 9:30 AM GMT
ప్రేమ కోసం విజయ్ పోరాటం!!
X
విజయ్ దేవరకొండ ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్న యంగ్ హీరో. పెళ్లి చూపులు మూవీ సక్సెస్ తో ఒక్కసారిగా ఈ కుర్రాడికి డిమాండ్ పీక్ స్టేజ్ కి చేరిపోయింది. వరుసగా ఆఫర్స్ తలుపు తట్టేస్తున్నాయి. మధ్యలో ద్వారక లాంటి ఫ్లాప్ కూడా విజయ్ దేవరకొండకు బ్రేక్ వేయలేకపోయింది.

పెళ్లి చూపులు మూవీతో భారీ సక్సెస్ కొట్టిన విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత యష్ రంగినేనికి మరో మూవీ చేయనున్నాడు. బిగ్ బెన్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ మూవీకి.. ఇప్పుడు ప్రీ లుక్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రీ లుక్ విడుదల చేయగా.. మొహం మీద పెద్ద కత్తిగాటుతో హీరో కనిపిస్తాడు. విజయ్ దేవరకొండ మొహంలో కనిపిస్తున్న ప్రేమ.. కోపం.. ఆవేశం.. హీరోయిన్ కళ్లలోకి చూస్తున్న చూపులు.. మూవీ ఇంటెన్సిటీ స్థాయిని చెబుతాయి.

ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రానికి.. భరత్ కమ్మ దర్శకత్వం వహించనున్నాడు. 'నువ్వు ప్రేమించిన దాని కోసం పోరాటం చెయ్యాలి' అంటూ రాసిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయం. యాక్షన్.. రొమాన్స్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కనుండగా.. విజయ్ దేవరకొండకు తన రేంజ్ పెంచుకునేందుకు దీన్ని మరో అవకాశంగా చెప్పచ్చు.