Begin typing your search above and press return to search.
బన్ని - విజయ్ అటూ ఇటూ తారు మారు!
By: Tupaki Desk | 16 Jun 2021 7:30 AM GMTబన్ని అటెళితే విజయ్ దేవరకొండ ఇటొస్తాడు! ఇదీ టాలీవుడ్ లో లేటెస్ట్ గుసగుస. ఇంతకీ దేనికోసం? అంటే.. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప పార్ట్ -1 పూర్తి చేశాక ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో ఐకన్ లో నటించాల్సి ఉంది. దిల్ రాజు ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐకన్ పూర్తి చేశాక తిరిగి సుకుమార్ తో పుష్ప 2 చేస్తారు.
అయితే పుష్ప -1 తర్వాత సుకుమార్ తో సినిమా కోసం విజయ్ దేవరకొండ కాల్షీట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సుక్కూ అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. అటు పూరీతో లైగర్ చిత్రీకరణ పూర్తి చేసి విజయ్ ఇటొస్తారన్నమాట. అలా ఆ ఇద్దరూ అటూ ఇటూ మారుతున్నారన్నమాట. ఐకన్ కి పుష్ప 2 కి మధ్య కొరటాలతో సినిమా ఉంటుందా లేదా? అన్నది కూడా బన్నీయే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక విజయ్ కి మునుముందు అంతా కలిసొచ్చే కాలమే. పూరి-కరణ్ లతో లైగర్ పాన్ ఇండియా కేటగిరీలో వస్తోంది. అప్పటికి పుష్పతో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా ఓ వెలుగు వెలుగుతాడు. అంటే దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నట్టు. ఇది అతడి కెరీర్ ని ఒక్కసారిగా టాప్ రేంజులోకి తీసుకెళుతుందని అంచనా. పుష్ప చాప్టర్ -1 చాప్టర్ -2 మధ్య విజయ్ సినిమా సుకుమార్ చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ స్నేహితుడు కేదార్ నిర్మిస్తారు.