Begin typing your search above and press return to search.
రౌడీస్లార్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా?
By: Tupaki Desk | 10 July 2022 6:30 AM GMTరౌడీస్టార్ విజయ్ దేవరకొండతో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాక్సింగ్ నేపథ్యంలో `లైగర్` తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో ఏకంగా బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ ని సైతం రంగంలోకి దించారంటే సినిమాని పూరి ఏ రేంజ్లో డిజైన్ చేసి వదులుతున్నాడో? అంచనా వేయోచ్చు.
ఆరు నెలల్లో సినిమా చుట్టేసే పూరి `లైగర్` కోసం ఏకంగా సంవత్సరాలు సమయం వెచ్చిస్తున్నారంటే? ప్రాజెక్ట్ విషయంలో పూరి ఎంత సీరియస్ గా ఉన్నారో అద్దం పడుతుంది. ప్రతీ సన్నివేశాన్ని పూరి ఓ క్లైమాక్స్ లో తీర్చదిద్దుతున్నాడని సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. తెలుగు..హిందీతో పాటు ఇతర భాషల్లోనూ పాన్ ఇండియా కేటగిరీలో `లైగర్` రిలీజ్ అవుతుంది.
అయితే ఈ ప్రాజెక్ట్ రిలీజ్ కి ముందే పూరి రౌడీబోయ్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన`ని లాంచ్ చేసిన తెలిసిందే. మరి పూరి ఇలా బ్యాక్ టూ బ్యాక్ విజయ్ ని దేనికి టార్గెట్ చేసినట్లు అంటే? అతనితో హిట్ కొట్టించి...పాన్ ఇండియా స్టార్ గా లాంచ్ చేయడమే పూరి టార్గెట్ గా కనిపిస్తుందని పూరి కాంపౌండ్ నుంచి లీకైంది. `అర్జున్ రెడ్డి` ఫేం ని ఎన్ క్యాష్ చేసుకుంటూ పాన్ ఇండియా వైడ్ అతనికొచ్చిన ఐడెంటిటీని పీక్స్ తీసుకెళ్లాలన్నదే పూరి ఆలోచనగా కనిపిస్తుంది.
ముందుగా `లైగర్` తో హిట్ కొట్టి ఆ తర్వాత పాన్ ఇండియా లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత `జేజీఎమ్` తో మరో హిట్ ఇచ్చి ఏకంగా పాన్ ఇండియాలోనే సూపర్ స్ టార్ గా తీర్చిదిద్దాలన్న కసి పట్టుదల పూరి లో కనిపిస్తుంది. `జేజీఎమ్` ఆర్మీ బ్యాక్ డ్రాప్ వార్ స్టోరీ. కశ్మీర్ బోర్డ్ లోనే ఎక్కవ కథ నడుస్తుంది. ఈ సినిమా విషయంలో పూరి మైండ్ లో ఫిక్సై బ్లైండ్ గా మయుందుకెళ్తున్నాడు.
వాస్తవానికి `లైగర్` తర్వాత `జేజీఎమ్` నే పట్టాలెక్కాల్సి ఉందిట. కానీ పూరి వేగాన్ని చూసి విజయ్ అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. పూరి పై ఇప్పటికే రొటీన్ జానర్ దర్శకుడనే విమర్శ ఉంది. `లైగర్` కూడా అలాంటిదే ? అయితే పరిస్థితి ఏంటని సందేహించి `జేజీమ్` ని హోల్డ్ లో పెట్టి `ఖుషీ` చిత్రాన్ని ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లి సేపే గేమ్ మొదలు పెట్టినట్లు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది.
ఒక వేళ `లైగర్` పోయినా..`ఖుషీ` సినిమాతో బయట పడొచ్చు అన్న ఆలోచనతో ఖుషీ ని `లైగర్` కి `జేజీఎమ్` కి మధ్యలో ఇరికించినట్లు తెలుస్తోంది. రెండు హిట్టైతే అతనంత లక్కీ హీరో ఉండడు. ఒక వేళ ఫలితాలు తేడాగా వస్తే జాగ్రత్త పడటానికి ఆస్కారం ఉంటుందన్న ఆలోచన కనిపిస్తుంది. వాస్తవానికి `జేజీఎమ్` ని సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించాలనుకున్నారు.
కానీ పూరి ఫెయిల్యూర్ ట్రాక్ చూసి మహేష్ రిజెక్ట్ చేసారు. దీంతో పూరి ఆ ప్రాజెక్ట్ ని మరింత ప్రెస్జిజీయస్ గా తీసుకుని ముం దుకు సాగుతున్నారు. ఈ వేగంలో ఎక్కడ తప్పిదాలు దొర్లినా యంగ్ హీరో దొరికిపోవడానికి ఛాన్స్ ఉంది. అందుకే రౌడీస్టార్ ఇటు యాక్షన్..అటు లవ్ స్టోరీ అంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.