Begin typing your search above and press return to search.
హిట్ ఒకటే పెండింగ్ రా.. కొడదామన్న రౌడీ కొండ
By: Tupaki Desk | 16 Feb 2023 11:07 AM GMTరంగుల ప్రపంచంలో అజేయంగా దూసుకెళ్లడం అన్నది బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలకు సైతం సాధ్యపడదు. ఎలాంటి సినీనేపథ్యం లేని యువహీరోలు కూడా నేడు దూసుకెళుతున్నారు. నైజాం నుంచి క్రేజీ హీరోగా వెలిగిపోతున్నాడు విజయ్ దేవరకొండ.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించిన హీరో అతడు. ల్యాండ్ మార్క్ అనదగ్గ హిట్లు కొట్టాడు దేవరకొండ. అయితే విజయాలతో పాటు పరాజయాలు ఎదురయ్యాయి. ఇటీవల పాన్ ఇండియా విజయమే ధ్యేయంగా తెరకెక్కిన 'లైగర్' తీవ్రంగా నిరాశపరిచింది.
దీనికి దేవరకొండ అభిమానులు కూడా కలత చెందారు. తమ ఫేవరెట్ హీరోకి ఒక హిట్టు పడాలని అంతా ఆశిస్తున్నారు. తాజాగా దేవరకొండ తన అభిమానులతో వర్చువల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఒక్క హిట్టు అన్నా! అంటూ అభిమానులు అతడిని కోరారు.
విజయ్ దీనికి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ''ఒకటే పెండింగ్ రా.. హిట్టడం'' అని వ్యాఖ్యానించారు. దీనికి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ''మేం 'ఖుషి'తో చేస్తాం'' అని అభిమానులు స్పందించారు. ఈ సమాధానానికి విజయ్ నవ్వుతూ తన అభిమానులను ఖుషీ చేసే ప్రయత్నం చేసారు.
ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు హిందీ బెల్ట్ లోను విజయ్ దేవరకొండకు భారీ ఫాలోయింగ్ ఉంది. దానివల్ల అతడు హిట్టు కొట్టడం అంటే సౌత్ - నార్త్ రెండు చోట్లా అనుకున్న స్థాయిలో వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. నిర్మాతలు ఖుషి సినిమాని పాన్ ఇండియా కేటగిరీలో విడుదల చేస్తారా? లేదా కేవలం తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ కే పరిమితమవుతుందా? అన్నది వేచి చూడాలి.
విజయ్ - సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి చిత్రీకరణ దశలో ఉంది. సమంత కాల్షీట్లు అందుబాటులోకి రాగానే తదుపరి చిత్రీకరణకు వెళ్లనున్నారని సమాచారం. తదుపరి జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరితో విజయ్ ఓ చిత్రం చేయాల్సి ఉంది. ఇది ఒక కాప్ డ్రామా. సీరియస్ కాప్ యాక్షన్ కథతో తెరకెక్కనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.