Begin typing your search above and press return to search.
ఇంకో రెండు వారాల్లో దేవరకొండ సినిమా
By: Tupaki Desk | 25 Feb 2018 5:38 AM GMTవిజయ్ దేవరకొండ కొత్త సినిమాలేవీ ఇంకా విడుదలకు ముస్తాబవ్వలేదు కదా.. ఇంకో రెండు వారాల్లో విడుదలయ్యే అతడి సినిమా ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? విజయ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలేవీ రెడీగా లేవు కానీ.. ఎప్పుడో చేసిన సినిమా మాత్రం విడుదలకు ముస్తాబైపోయింది. రెండు మూడేళ్ల కిందటే విజయ్ ‘ఏ మంత్రం వేసావె’ అనే సినిమా ఒకటి మొదలుపెట్టాడు. ఈ సినిమా మొదలయ్యే సమయానికి విజయ్ కు పెద్దగా గుర్తింపేమీ లేదు. ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత అతను మొదలుపెట్టిన సినిమా ఇది. ఐతే అనివార్య కారణాల వల్ల అది మధ్యలో ఆగింది. షూటింగ్ ఆలస్యంగా పూర్తయింది.
‘పెళ్ళి చూపులు’.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో విజయ్ క్రేజ్ పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో పడింది ‘ఏ మంత్రం వేసావె’ చిత్ర బృందం. ‘గోలీసోడా’ ప్రొడక్షన్స్ బేనర్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీధర్ మర్రి అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన శివానీ సింగ్ అనే కొత్తమ్మాయి నటించింది. ఈ చిత్రాన్ని మార్చి 9న ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్ణయించారు. మార్చి 2న మొదలయ్యే చిత్ర పరిశ్రమ సమ్మె త్వరగా ముగిసిపోతే 9న ఈ చిత్రం విడుదలవుతుంది. లేదంటే తర్వాత ఎప్పుడు కుదిరితే అప్పుడు సినిమాను రిలీజ్ చేస్తారు. ఈ చిత్ర పోస్టర్లలో విజయ్ లుక్ చూస్తే ఇది ఇప్పటి సినిమా కాదన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. మరి ఈ సినిమా విజయ్ క్రేజుని ఏమేరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.