Begin typing your search above and press return to search.

ఆ సక్సెస్ అంత పెద్ద స్టార్ ని చేసిందా?

By:  Tupaki Desk   |   9 March 2018 4:38 AM GMT
ఆ సక్సెస్ అంత పెద్ద స్టార్ ని చేసిందా?
X
అర్జున్ రెడ్డి మూవీతో యంగ్ హీరో విజయ్ దేవరకొండకు బోలెడంత ఇమేజ్ వచ్చిన మాట అయితే నిజమే. అందులో ఎలాంటి డౌట్స్ ఉండవు. కానీ ఈ కుర్రాడికి ఎంతటి క్రేజ్ ఏర్పడిందనే విషయం.. ఆ తర్వాతి సినిమాను.. దాని కలెక్షన్స్ ను అనుసరించే తెలుస్తుంది. విజయ్ దేవరకొండకు ఇబ్బందిగా ఉన్నా.. ఏం మంత్రం వేశావే అనే చిత్రం రిలీజ్ ఇవాళే.

ఈ సినిమాకు ఇచ్చిన థియేటర్లను చూస్తే.. విజయ్ దేవరకొండను అర్జున్ రెడ్డి మూవీ ఇంత పెద్ద స్టార్ చేసేసిందా అనిపిస్తుంది. ఎందుకంటే.. హైద్రాబాద్ లాంటి సిటీలో మూడొంతుల థియేటర్లలో ఈ చిత్రాన్నే ప్రదర్శిస్తున్నారు. అది కూడా ఈ యంగ్ హీరో అసలేమాత్రం ప్రచారం చేయకుండానే ఇంతటి రిలీజ్ లభించడం చెప్పుకోవాల్సిన విషయం. కంటెంట్ కొంచెమైనా ఆకట్టుకునేలా ఉంటే ఎలాగూ వేరే ఆప్షన్స్ జనాలకు లేవు కాబట్టి.. హిట్టు సులభంగానే వస్తుంది. మరి ఇంత పెద్ద రిలీజ్ లభించడం వెనక.. అర్జున్ రెడ్డి నుంచి అందిన క్రేజ్ ఒక్కటే కారణమా అనే డౌట్ సహజమే.

నిజానికి ఇది రిలీజ్ డేట్ మహత్యం. సరిగ్గా సినిమా థియేటర్ల సమ్మె అనౌన్స్ చేసిన తర్వాత వారంలో ఈ సినిమాను షెడ్యూల్ చేశారు. వేరెవరూ అంత ధైర్యం చేయలేదు. రిలీజ్ డేట్ వచ్చేసరికి సమ్మె ముగిసింది. అప్పటికే థియేటర్లలో ఉన్న సినిమాలు పాతవి అయిపోయాయి. కొత్త సినిమాతో మళ్లీ థియేటర్లు తెరుస్తున్నారు. అందుకే ఇంత పెద్ద రిలీజ్ వచ్చేసింది. వేరే సినిమా పోటీ ఉంటే ఇంతటి రిలీజ్ అసాధ్యం అనాల్సిందే. ఏకంగా మూడొంతుల థియేటర్లలో రిలీజ్.. విజయ్ దేవరకొండ సినిమాకు లభించడం అంటే అది నిజంగా పెద్ద మ్యాటరే.