Begin typing your search above and press return to search.
రాజు గారికి విజయ్ గండం!!
By: Tupaki Desk | 19 Sep 2018 5:30 PM GMTకొన్నిసార్లు మన సినిమా మీద ఎంత నమ్మకం ఉన్నా అవతలి వైపు పోటీలో కంటెంట్ ఎక్కువున్నది అయితే దెబ్బ తినక తప్పదు. ఇది అన్ని సినిమాలకు వర్తిస్తుంది. దానికి పెద్ద చిన్న అనే తేడా ఉండదు. గత ఏడాది ఏకంగా ఆరు సినిమాలతో డిజాస్టర్ పదానికి దూరంగా ఉన్న నిర్మాత దిల్ రాజు 2018లో మాత్రం చాలా చేదు ఫలితాలు చవి చూస్తున్నారు. రాజ్ తరుణ్ తో తీసిన లవర్ కనీసం పెట్టుబడిని కూడా వెనక్కు ఇవ్వకపోగా సినిమా స్థాయికి మించి ప్రమోట్ చేసి ఊదరగొట్టిన శ్రీనివాస కళ్యాణం కూడా అదే దారిలో ప్రయాణించింది. నిజానికి శ్రీనివాస కళ్యాణంలో జస్ట్ ఓకే అనిపించే విషయం ఉన్నా వారం తిరగకుండానే వచ్చిన గీత గోవిందం సునామి లాగా బాక్స్ ఆఫీస్ ను కమ్ముకోవడంతో దిల్ రాజు సినిమాకు కనీసం యావరేజ్ అనిపించుకునే అవకాశం కూడా దొరకలేదు. అప్పటి దాకా పర్వాలేదు అనేలా ఉన్న వసూళ్లు దాని దెబ్బకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. అంటే పోటీ వల్లే అని కాదు కానీ కథాకథనాల విషయంలో శ్రద్ధవహించకపోవడం కూడా దాని అవకాశాలను దెబ్బ తీసింది.
ఇక తన మూడో సినిమా హలో గురు ప్రేమ కోసమే కోసం దిల్ రాజు చాలా ప్లానింగ్ తో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది దిల్ రాజు బ్యానర్ లో వచ్చే చివరి సినిమా ఇదే. మళ్ళి సంక్రాంతికి వచ్చే ఎఫ్2 దాకా బ్రేక్ తప్పదు. అందుకే దీని విషయంలో పక్కా స్కెచ్ తో ఉన్నారట. కానీ ఈసారి కూడా విజయ్ దేవరకొండ బరిలో దిగి పోటీకి కవ్వించే అవకాశాలు ఉన్నాయి. నోటా విడుదల నిజానికి అక్టోబర్ 4 లేదా 5 అని ఇంతకు ముందే చెప్పేసారు. కానీ రీ రికార్డింగ్ తో సహా ఇంకా చాలా పనులు బాలన్స్ ఉన్నాయి. బిజినెస్ కూడా పూర్తి కాలేదు. ఇవన్నీ ఒక కొలిక్కి వస్తే ఓకే. కుదరలేదు అంటే మాత్రం అక్టోబర్ 16 లేదా 18 వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో అరవింద సమేత వీర రాఘవ ఉంది కాబట్టి వేరే ఆప్షన్ లేదు. అదే కనక జరిగితే హలో గురు ప్రేమ కోసమేతో నోటా పోటీ పడాల్సి ఉంటుంది. శ్రీనివాస కళ్యాణంతో గీత గోవిందం ఢీ కొట్టినట్టు ఇప్పుడు మాత్రం రిపీట్ కాకూడదనే దిల్ రాజు అంచనా. ఇటీవలే నడుము కాఫీ కాన్సెప్ట్ తో వదిలిన టీజర్ మంచి స్పందన దక్కించుకోవడం అంచనాలు పెంచుతోంది. క్లారిటీ రావాలంటే నోటా డేట్ పక్కాగా అనౌన్స్ చేయాల్సిందే.