Begin typing your search above and press return to search.

పెళ్లి పిల్ల‌ల‌ను క‌న‌డంపై VD ఏమ‌న్నాడంటే?

By:  Tupaki Desk   |   28 July 2022 4:57 AM GMT
పెళ్లి పిల్ల‌ల‌ను క‌న‌డంపై VD ఏమ‌న్నాడంటే?
X
టాలీవుడ్ హ్యాండ్స‌మ్ హీరో విజయ్ దేవరకొండకు ఉత్త‌రాదినా భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను ల‌క్ష‌లాదిగా యువ‌తులు ప్రేమిస్తున్నారు. మ‌రోవైపు అందాల క‌థానాయిక‌లు ఒక‌రితో ఒక‌రు వీడీ ప్రేమ‌ కోసం పోటీప‌డుతున్నారు. సారా అలీఖాన్ - జాన్వీ క‌పూర్ - అనన్య పాండే లాంటి భామ‌లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప్రేమ‌ను దాచుకోవ‌డం లేదు. ప్ర‌తిదీ బ‌హిరంగంగానే చెబుతున్నారు.

అయితే కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7 తాజా ఎపిసోడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎవ‌రినైనా ప్రేమిస్తున్నారా? అన్న ప్రశ్న‌ను ఎదుర్కొన్నాడు. ఎవ‌రితో అయినా సంబంధంలో ఉన్నారా? అంటూ కూడా హోస్ట్ క‌ర‌ణ్ సూటిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ప్ర‌శ్నించారు.

దానికి అత‌డి నుంచి ఊహించ‌ని సమాధానం వ‌చ్చింది. నేను పెళ్లి చేసుకుని పిల్లలను కనే రోజు ఒక‌టి ఉంటుంది.. దానిని బిగ్గ‌ర‌గా అంద‌రికీ తెలియ‌జేస్తాను అని అన్నారు. అప్పటి వరకు నన్ను ఆరాధించే వారిని బాధపెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఒక నటుడిగా నన్ను ప్రేమించే వారు చాలా మంది ఉన్నారు . పోస్టర్ ను వారి గ‌దిలో గోడపైనా.. వారి ఫోన్ లలోను ఉంచారు. వారు నాకు చాలా ప్రేమను ఇస్తున్నారు.

ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే నేను వారి గుండెలు ప‌గిలేలా చేయాల‌నుకోవ‌డం లేదు'' అని విజయ్ దేవరకొండ స‌మాధాన‌మిచ్చారు. మీరు సంబంధంలో ఉన్నారా? అని కరణ్ జోహార్ అడిగినప్పుడు దానిని ధృవీకరించడానికి వీడీ ఇష్టపడలేదు. ఈ ఎపిసోడ్ లో విజ‌య్ అస‌లు ఏ నిజాన్ని అంగీక‌రించ‌లేదు. తాను ప్రేమ‌లో ఉన్నాడా? .. ఎఫైర్ ఉందా లేదా? అన్న విష‌యాలు దాచేశాడు.

'కాఫీ విత్ కరణ్ సీజన్ 7' డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. నాలుగో ఎపిసోడ్ లో విజ‌య్ తో అన‌న్య కూడా సంద‌డి చేసింది. కొత్త టాటిల్‌టేల్ గేమ్ లు ..ఆల్-టైమ్ ఫేవరెట్ ర్యాపిడ్ ఫైర్ ప్ర‌శ్న‌ల‌తో షో ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది.

తార‌ల‌కు త‌మ‌ అభిమానులను మరింత చేరువ చేసేందుకు ఇవ‌న్నీ స‌హ‌క‌రిస్తున్నాయి. త‌దుప‌రి లైగ‌ర్ విడుద‌ల ప్ర‌చారంలో అన‌న్య‌తో క‌లిసి వీడీ హైద‌రాబాద్ లోనూ సంద‌డి చేయ‌నున్నాడు.