Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ పై విజ‌య్ అస‌హ‌నంగా ఉన్నాడా?

By:  Tupaki Desk   |   10 Aug 2022 4:24 AM GMT
క‌ర‌ణ్ పై విజ‌య్ అస‌హ‌నంగా ఉన్నాడా?
X
లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవ‌ల `కాఫీ విత్ కరణ్ 7` లో అన‌న్య పాండేతో క‌లిసి క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. హోస్ట్ క‌ర‌ణ్ జోహార్ ఈ ఎపిసోడ్ ని బ్లాస్ట్ అయ్యేంత ఛీజీగా తీర్చిదిద్దారు. అయితే ఈ ఎపిసోడ్ లో ఒక ప్ర‌శ్నకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కలత చెందాడని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.

దేవరకొండ అనన్య పాండేతో ఎపిసోడ్ తర్వాత కరణ్ జోహార్ పై సీరియ‌స్ గా ఉన్నాడ‌ని.. `జున్ను` అంటూ కామెంట్ చేయడంపై క‌ల‌త చెందాడ‌ని రూమ‌ర్ పుట్టుకొచ్చింది. కరణ్ జోహార్ విజయ్ దేవరకొండకు మెంటార్ (ప్ర‌చార‌క‌ర్త కూడా) .. అందువ‌ల్ల‌ విజయ్ కి క‌ర‌ణ్ పై గౌరవం ఉంది. కానీ జున్ను ప్లేట‌ర్ అంటూ అవమానించ‌డం న‌చ్చ‌లేదంటూ ముంబై మీడియా పాయింట్ అవుట్ చేస్తోంది.

ఇంత‌లోనే విజయ్ కాస్త క‌ల‌త‌గా ఉన్న ఒక‌ వీడియో ఇటీవల ఆన్ లైన్ లో కూడా కనిపించింది. ముంబై ఫోటోగ్రాఫర్ లలో ఒకరు ``విజ‌య్ అన్నా జున్ను అంటే ఇష్టమా?`` అని అడుగుతున్న ఆ వీడియోలో విజ‌య్ కాస్త సీరియ‌స్ గా క‌నిపించాడు. నిజానికి ఫోటోగ్రాఫ‌ర్ అత‌డిని స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించాడ‌ని కూడా అర్థ‌మ‌వుతోంది. అయినంత మాత్రాన ఎందుకంత సీరియ‌స్ అయ్యాడు? అన్న‌దే పాయింట్ గా మారింది.

జున్ను అని పిలవడంతో విజ‌య్ అస‌హ‌నంగా క‌నిపించాడ‌ని.. అలా పిలిచినందుకు సంతోషంగా లేడని ముంబై మీడియా ప్ర‌చారం చేస్తోంది. షోలో కరణ్ జోహార్ నేరుగా సారా అలీ ఖాన్ ను డేటింగ్ చేయాలనుకునే ఒక నటుడి పేరును చెప్పాల‌ని కోర‌గా.. విజయ్ దేవరకొండ పేరును సూచించింది.

దేవ‌ర‌కొండ‌ పేరును ప్ర‌స్థావిస్తూ KJo సారా ప‌క్క‌నే ఉన్న‌ జాన్వీని ప్ర‌శ్నిస్తూ `విజయ్ ని ఇష్టపడుతున్నారా?` అని అడిగాడు. తరువాత ఆ ఇద్ద‌రూ జున్ను ప్లేట‌ర్ వండుతూ హాస్యం పండించారు. ఆ త‌ర్వాత ఓ షోలో అనన్య కూడా ఆ జున్ను ప్లేటర్ లో ఉండేందుకు అభ్యంత‌రం లేద‌ని కూడా అంది.

మొత్తానికి బాలీవుడ్ లో విజ‌య్ ను `జున్ను` అంటూ ఇర్రిటేట్ చేశారంటూ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. అయితే అదంతా స‌ర‌దా వ్యాప‌కం .. ప్ర‌చారం కోసం ఎత్తుగ‌డ అని కూడా భావించాలేమో! `లైగ‌ర్` చిత్రం ఆగ‌స్టు 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.