Begin typing your search above and press return to search.
#AyyaThathaEvadTelvadhu అంటూ VD ట్వీట్..!
By: Tupaki Desk | 25 July 2022 9:12 AM GMT'లైగర్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ వీడీ మాట్లాడుతూ.. నా తాత ఎవరో మీకు తెలియదు.. తండ్రి ఎవరో తెలియదు.. అయినా ఇంత అభిమానం చూపిస్తున్నారు అని అన్నారు.
అయితే విజయ్ కామెంట్స్ పరోక్షంగా నెపోటిజం హీరోలను టార్గెట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. తాతలు తండ్రుల పేరు చెప్పుకుని స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోలను దృష్టిలో పెట్టుకునే ఇలా వ్యాఖ్యానించారన్నారు. దీనిపై బండ్ల గణేష్ ఇన్ డైరెక్టర్ గా కౌంటర్ వేశారు.
'లైగర్' ఈవెంట్ లో విజయ్ దేవరకొండ కామెంట్స్ తో అతని అభిమానులు రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. విజయ్ అన్న సినిమా డైలాగ్సే కాదు.. నార్మల్ స్పీచ్ లో మాటలు కూడా ట్రెండ్ అవుతాయి అంటూ ఓ నెటీజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
ఇందులో ఓ అభిమాని టీ కొట్టు దగ్గర ఒకరు 'లైగర్' ఈవెంట్ లో విజయ్ డైలాగ్ ను ఉటంకిస్తూ కనిపించాడు. దీనికి VD స్పందిస్తూ #AyyaThathaEvadTelvadhu అనే హ్యాష్ ట్యాగ్ ను సృష్టించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు అవుతోంది.
ఇప్పటికే విజయ్ కామెంట్స్ ఇప్పటికే పలువురు సినీ బ్యాగ్రౌండ్ తో వచ్చిన హీరోల అభిమానులను బాధించాయి. అంతా నెమ్మదిగా సమిసిపోతుందని అనుకుంటుండగా.. VD దాన్నే హ్యాష్ ట్యాగ్ గా పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
నిజానికి ఈవెంట్ లో విజయ్ అలాంటి కామెంట్స్ చేసినప్పుడు కొందరు సోషల్ మీడియాలో అతన్ని సమర్ధించారు. కావాలని వీడీ అలా మాట్లాడి ఉండడని.. అంతమంది ఫ్యాన్స్ తరలి రావడంతో అనుకోకుండా వ్యాఖ్యానించి ఉండొచ్చని అభిప్రాయ పడ్డారు.
కానీ ఇప్పుడు 'అయ్యా తాత ఎవడో తెలియదు' అని విజయ్ దేవరకొండ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ ట్వీట్ చేయడంతో.. ఈ వివాదంతోనే తన సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకోవాలని భావిస్తున్నాడేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇటీవల 'లైగర్' సినిమా నుంచి విజయ్ న్యూడ్ పిక్ ని రిలీజ్ చేసినప్పుడు విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయినా సరే వెనక్కి తగ్గకుండా చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అప్పుడు VD సెమీ న్యూడ్ ఫోటోని కటౌట్ గా పెట్టారు. ఇదంతా 'లైగర్' సినిమా గురించి జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేసింది.
ఇదే క్రమంలో వివాదంగా మారిన అయ్యా తాత ఎవడో తెలియదు కామెంట్స్ తోనే తన సినిమాని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాడని నెటిజన్లు అంటున్నారు. గతంలో 'అర్జున్ రెడ్డి' విడుదల సమయంలో కూడా నెగెటివ్ ప్రచారంతోనే సినిమాకి బజ్ తీసుకొచ్చాడని.. ఇప్పుడు 'లైగర్' కు కూడా అదే ఫాలో అవుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.