Begin typing your search above and press return to search.

ఉత్స‌వానికి రౌడీ పారితోషికం ఎంత‌?

By:  Tupaki Desk   |   26 May 2019 4:55 PM GMT
ఉత్స‌వానికి రౌడీ పారితోషికం ఎంత‌?
X
బుల్లితెర అవార్డులు.. వార్షికోత్స‌వ‌ వేడుక‌లు అంటే మామూలుగా ఉంటుందా వ్య‌వ‌హారం. టీవీ తెర‌లు చింపేయ‌రూ? పైగా టీవీ ఆర్టిస్టుల‌తో మ‌హోత్స‌వం అంటే ఇంకేమైనా అడ్డూ ఆపూ ఉంటుందా? ఇప్పుడున్న తెలుగు ఎంట‌ర్ టైన్ మెంట్ చానెళ్లు అనునిత్యం టీఆర్ పీల కోసం ఏదో ఒక ప్ర‌త్యేక‌మైన కార్య‌క్ర‌మం నిరంత‌రం చేస్తూనే ఉంటున్నాయి. వీకెండ్స్ లో.. ఆదివారాల్లో జ‌నాల్ని త‌మ టీవీల‌కు అతుక్కుపోయేలా చేసేందుకు చానెల్ కార్య‌క్ర‌మాల రూప‌క‌ర్త‌లు వేస్తున్న ఎత్తుగ‌డ‌లు అంతే క్రియేటివ్ గా ఉంటున్నాయి.

తెర నిండుగా పంచ‌వ‌న్నెల రామ‌చిలుక‌ల‌తో క‌ల‌ర్ ఫుల్ గా ఫ్రేము క‌నిపిస్తే చాలు టీఆర్ పీ దానంతట అదే త‌న్నుకొస్తుంది! అన్న ఫార్ములాని మ‌న బుల్లితెర‌ క్రియేట‌ర్స్ క‌నిపెట్టారు. బోయ‌పాటి ఫ్రేములా క‌ల‌ర్ ఫుల్ గా తెర‌నిండుగాప్ర‌తిదీ పేర్చ‌డం అల‌వ‌ర్చుకున్నారు. టీవీ సీరియ‌ళ్లలో న‌టించే ఆర్టిస్టుల‌తో డ్యాన్సులు చేయించ‌డం.. ఆటాపాటా కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయ‌డం దానికి సినీగ్లామ‌ర్ ని యాడ్ చేసి జ‌నాల్ని టీవీల‌కు అతుక్కుపోయే టెక్నిక్ ని ప్లే చేయ‌డం వ‌గైరా చాలానే చేస్తున్నారు. దీంట్లో డ్యాన్స‌ర్లు ఓవైపు సీరియ‌ల్ న‌టుల‌తో డ్యాన్సులు చేస్తూ ఫ్రేమ్ లో బిగి స‌డ‌ల‌కుండా చేస్తుంటారు. యాంక‌ర్లు.. హోస్టులు ర‌క్తి క‌ట్టించే కామెడీలు చేస్తుంటారు.

ఇదిగో ఈ ఆదివారం సాయంత్రం జీతెలుగు చానెల్లో అలాంటి కార్య‌క్ర‌మ‌మే ఇది. `జీ మ‌హోత్స‌వం 2019` పేరుతో ఘ‌నంగానే నిర్వహించిన ఈ షోకి ప్ర‌దీప్ మాచిరాజు.. శ్రీ‌ముఖి.. యాంక‌ర్ ర‌వి వంటి వాళ్లు గొప్ప గ్రిప్ తెచ్చారు. ఆస‌క్తిక‌రంగా ఈ వేదిక‌పై గీత‌- గోవిందం క‌లిసి వ‌చ్చి అదిరిపోయే ట్రీట్ ని ఇచ్చారు. ఆ ఇద్ద‌రూ వేదిక‌పైకి దూసుకొచ్చిన తీరు అంతే ఇంప్రెస్సివ్ గా ఉంది. ఇక ఇక్క‌డ షో ఇచ్చినందుకు దేవ‌ర‌కొండ ఉచితంగానే వ‌చ్చాడా? అంటే అబ్బే హీరోల‌కు అంత టైమ్ ఎక్క‌డ ఉంటుంది? కోటిన్న‌ర పారితోషికం అందుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌తి టీవీ కార్య‌క్ర‌మానికి స్టార్ల‌కు పారితోషికాలుంటాయి. పిలిస్తే వ‌చ్చే వీలు క‌ల్పించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. జీ ఆఫ‌ర్ కూడా అలాంటిదేన‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం యూత్ లో రౌడీ హ‌వాతో పాటు గీత ర‌ష్మిక హ‌వా కూడా న‌డుస్తోంది. మ‌రి గీత‌కు ఎంత ఇచ్చారో తెలీదు. ఆ ఇద్ద‌రి రాక‌తో టీవీ సీరియ‌ల్ కార్య‌క్ర‌మం కాస్తా.. క‌ల‌ర్ ఫుల్ గా మారింది. చానెల్ కి రేటింగ్ కి అది క‌లిసొచ్చింద‌న్న‌మాట‌.