Begin typing your search above and press return to search.

రౌడీగారి ఐస్ క్రీమ్స్ రెడీ మీరు రెడీనా?

By:  Tupaki Desk   |   8 May 2019 4:33 PM GMT
రౌడీగారి ఐస్ క్రీమ్స్ రెడీ మీరు రెడీనా?
X
పుట్టినరోజు అంటే ఏం చేస్తారు? గతంలో ఏం చేసేవారో ఏమో కానీ ఇప్పుడు మాత్రం కేకులు కట్ చేస్తున్నారు. పార్టీలు.. గిఫ్టులు.. ఒకటేమిటి అన్నీ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీల పుట్టిన రోజు సంగతి చెప్పనవసరం లేదు. ఎందుకంటే భారీ హంగామా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎలాగూ బర్త్ డే మెసేజులు ఫ్యాన్స్ నుండి.. ఫ్రెండ్స్ నుండి వెల్లువెత్తుతాయి. ఫ్యాన్స్ కొందరు రక్తదానాలు గట్రా టేకప్ చేస్తారు. ఇక హీరోలు పర్సనల్ గా పార్టీలో మునిగితేలడం ఖాయం. అవి కామనే. కానీ టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వీటితో పాటుగా మరో స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేశాడు.

శుక్రవారం..మే 9 న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సౌత్ లోని కొన్ని నగరాల్లో విజయ్ బర్త్ డే ట్రక్స్ ను ఏర్పాటు చేస్తున్నాడు. పాపులర్ ఐస్ క్రీమ్ బ్రాండ్ క్రీమ్ స్టోన్ తో కలిసి హైదరాబాద్.. వరంగల్.. విజయవాడ..తిరుపతి.. చెన్నై.. బెంగుళూరు.. కొచ్చి నగరాలలో ఈ బర్త్ డే ట్రక్స్ ను ఏర్పాటు చేస్తున్నాడు. ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నప్రజలకు ఈ ట్రక్కులు చల్లని హిమక్రీములను పంచుతాయి. ఇలా వేసవిలో ప్రజలకు ఐస్ క్రీములు పంచడం విజయ్ కు మొదటిసారేమీ కాదు. గత ఏడాది కూడా మే 9 న ఇలా హిమక్రీముల పంపిణీ చేపట్టాడు. కానీ హైదరాబాద్ లో మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టిన విజయ్ ఈ సారి సౌత్ అంతటికీ విస్తరించాడు.

విజయ్ దేవరకొండ ఎంచుకున్న నగరాలను గమనిస్తే సౌత్ లోని అన్ని రాష్ట్రాలను కవర్ చేసినట్టు కనిపిస్తోంది కదా. విజయ్ నెక్స్ట్ సినిమా 'డియర్ కామ్రేడ్' తెలుగు.. తమిళ.. కన్నడ.. మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. మరి సౌత్ ఇండియా మొత్తాన్ని టార్గెట్ చేయాలంటే దానికి తగ్గ ప్లాన్స్ వేయలిగా? ఎదైతేనేం.. రేపు విజయ్ ఐస్ క్రీమ్ ట్రక్కు కనిపిస్తే మోహమాటం లేకుండా ఐస్ క్రీమ్ తీసుకోండి.. అలా అని ఐస్ క్రీమ్ ట్రక్కు కోసం ఉదయం నుంచి ఎండలో వేచి చూస్తూ నిలబడేరు.. ఎండ వేడికి ఏకంగా ఆవిరైపోగలరు. తస్మాత్ జాగ్రత్త!