Begin typing your search above and press return to search.

న‌రాలు పొంగించి బాహులా మారాడు కానీ!

By:  Tupaki Desk   |   25 Feb 2020 1:30 PM GMT
న‌రాలు పొంగించి బాహులా మారాడు కానీ!
X
వ‌ర‌స ప్లాప్ ల‌తో డీలా ప‌డ్డాడు దేవ‌ర‌కొండ‌. ప్ర‌మోషన్స్ లో ఎంత ఎగ్రెస్సివ్ గా ఉన్నా.. స‌క్సెస్ ముఖం చాటేయ‌డం డైల‌మాలో ప‌డిపోయాడు. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ రిజ‌ల్ట్ నిర్మాత‌ల‌కు పెద్ద సెట్ బ్యాక్ అయ్యింద‌న్న టాక్ ప‌రిశ్ర‌మ‌లో వినిపించింది. అప్ప‌టికే ఫ్లాపుల్లో ఉన్న నిర్మాత‌కు పెద్ద‌ దెబ్బ కొట్టింద‌న్న చ‌ర్చా సాగుతోంది. అంత‌కుముందు తీసిన సినిమాలు కూడా ఆడ‌క‌పోవ‌డంతో క్రియోటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంద‌న్న ప్ర‌చారం ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో సాగింది.

ఇక‌పోతే ల‌వ్ స్టోరీల్లో న‌టించ‌ను అని విజ‌య్ ఏ ఉద్ధేశంతో అన్నాడో కానీ.. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ రిజ‌ల్ట్ కూడా ఆ మాట‌కే క‌ట్టుబ‌డి ఉండాల‌నే హెచ్చ‌రిక‌ను జారీ చేసిన‌ట్ట‌య్యింది. అందుకే ఇప్పుడు రూట్ మార్చి పూరి స్టైల్లో పూర్తి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ కి ప్రిప‌రేష‌న్ లో ఉన్నాడు. విజ‌య్ ఆశ‌ల‌న్నీ పూరీ తీసే సినిమాపైనే. అందుకోసం రౌడీ బోయ్ చాలానే క‌ష్ట‌ప‌డుతున్నాడు. జిమ్ ల చుట్టూ తిరిగి.. మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకుని పూర్తి ఫిట్ నెస్ తో ఉండ‌టానికి ప‌క్కా ప్రిప‌రేష‌న్ సాగించాడు.

గీత గోవిందం త‌రవాత అలాంటి హిట్ లేక అల్లాడిపోతున్న దేవ‌ర కొండ‌కు మ‌రో క్లాసిక్ హిట్ ప‌డాల్సిన టైమ్ ఇది. ప్ర‌స్తుతం హోప్స్ అన్నీ `ఫైట‌ర్` పైనే. ఇస్మార్ట్ పూరి త‌న‌కో బంప‌ర్ హిట్ ఇస్తాడ‌న్న న‌మ్మ‌కంతో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. ఇదిగో ఇప్ప‌టికీ జిమ్ లో ఏ రేంజులో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడో తాజా ఫోటో చెప్ప‌క‌నే చెబుతోంది. బైసెప్.. ట్రైసెప్ స‌హా షోల్డ‌ర్ షేప్ లు షేక్ చేస్తున్నాయి. అలాగే ఈ చిత్రంలో 6 ప్యాక్ రూపంతో విజ‌య్ స‌ర్ ప్రైజ్ ట్రీట్ ఇస్తాడ‌ని ఆ లుక్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇక ఫైట‌ర్ లో సంజ‌య్ ద‌త్ లాంటి బిగ్ స్టార్ ని ఢీకొడ‌తాడ‌ని ద‌త్ కూడా ఓ రోల్ పోషిస్తాడ‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది.