Begin typing your search above and press return to search.
వరల్డ్ ఫేమస్ లవర్ కోసమేనా రౌడీ?
By: Tupaki Desk | 27 Sep 2019 2:30 PM GMTయువహీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ నలుగురు భామలతో రొమాన్స్ చేస్తున్నాడు. ఆ నలుగురు భామలు.. రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్.. కాథరిన్ ట్రెసా.. ఇజబెల్ లీట్. అయితే ఇంతమంది భామలు ఉన్నప్పటికీ ఈ సినిమా ఫస్ట్ లుక్ లో మాత్రం 'అర్జున్ రెడ్డి'కి అప్డేటెడ్ వెర్షన్ లా అదోరకంగా కనిపించాడు. మాసిన గడ్డం.. రేగిన జుట్టు.. సిగరెట్టుతో లవ్ ఫెయిల్యూర్ లా కనిపించాడు.
ఆ ఫస్ట్ లుక్ కు ఎందుకో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మెజారిటీ ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ కాలేదు. అయితే అంత ఇంటెన్స్ లుక్ లో కనిపించాడంటే దాని వెనక ఏదో సీరియస్ ఎపిసోడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ సంగతి పక్కన పెడితే విజయ్ తాజాగా ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ లో విజయ్ లుక్ పూర్తిగా కొత్తగా కనిపించింది. కాస్త కర్లీగా ఉండే పొడవాటి జుట్టు... కొంచెం బ్లీచ్ చేసిన హెయిర్.. పూర్తిగా ట్రిమ్ చేసిన గడ్డంతో స్టైలిష్ గా కనిపించాడు. విజయ్ డ్రెసింగ్ ఎప్పుడూ ఫ్యాషనబుల్ గా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మరోసారి ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నాడు.
ఈ కొత్త లుక్ ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి ఈ లుక్ 'వరల్డ్ ఫేమస్ లవర్' లో ఒక ఎపిసోడ్ కోసమే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి అది నిజమా కాదా అనేది తెలియాలంటే 'వరల్డ్ ఫేమస్ లవర్' టీమ్ నుంచి కొత్త పోస్టర్లు రిలీజ్ కావాలి.. లేదా ఆన్ లొకేషన్ స్టిల్స్ లీక్ కావాలి. అప్పటివరకూ అవి ఊహాగానాలే!