Begin typing your search above and press return to search.
డిలే తప్పదా డియర్ కామ్రేడ్?
By: Tupaki Desk | 21 April 2019 9:00 AM GMTఈ ఏడాది సమ్మర్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పటికే కొన్ని సమ్మర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే రిలీజ్ కావలసిన సమ్మర్ సినిమాలలో క్రేజీ ప్రాజెక్టులు రెండు మూడే ఉన్నాయి. వాటిలో ఒక క్రేజీ ఫిలిం విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్'. అసలే యూత్ ఐకాన్ గా మారిన విజయ్ హీరో కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ విషయంపై ఇప్పుడు కన్ఫ్యూజన్ నెలకొంది.
మే 31 న రిలీజ్ చేస్తారని ఈ మధ్య క్లారిటీ ఇచ్చినప్పటికీ అదే డేట్ కు పోటీలో ఇతర సినిమాలు ఉండడంతో రిలీజ్ డేట్ ను మార్చే ఆలోచనలో ఉన్నారట. తెలుగులో మాత్రమే అయితే ఈ రిలీజ్ డేట్ కు ఇబ్బంది లేదు. శర్వానంద్ - సుధీర్ వర్మ సినిమా మాత్రమే మే 31 న రిలీజ్ అవుతోంది. కానీ 'డియర్ కామ్రేడ్' సినిమాను అన్ని సౌత్ భాషలలో రిలీజ్ చేస్తుండడంతో చిక్కు వచ్చి పడింది. తమిళంలో సూర్య సినిమా 'NGK'.. విక్రమ్ నటించిన 'కదరం కొండన్' అదే తేదీన రిలీజ్ అవుతున్నాయి. విక్రమ్ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుందో లేదో తెలియదు కానీ సూర్య సినిమా తెలుగు వెర్షన్ అదే తారీఖున రిలీజ్ చేస్తారు. అందుకే 'డియర్ కామ్రేడ్' ను రెండు వారాలు ఆలస్యంగా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట.
త్వరలోనే ఈ రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు నిర్మాతలు మైత్రీ మూవీస్ వారు.