Begin typing your search above and press return to search.

VD తోనే ఆట‌లా! జాన్వీ- ఖుషీతో అన‌న్య రేస్ లో?

By:  Tupaki Desk   |   28 July 2022 4:06 AM GMT
VD తోనే ఆట‌లా! జాన్వీ- ఖుషీతో అన‌న్య రేస్ లో?
X
క‌ర‌ణ్ జోహార్ హోస్ట్ గా `కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7` ఓటీటీలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మూడు ఎపిసోడ్లు బ్లాస్ట్ అయ్యాయి. చివ‌రిగా స‌మంత‌- అక్ష‌య్ కుమార్ ఎపిసోడ్ ఎంతో ఆక‌ట్టుకుంది. ఇప్పుడు నాల్గవ ఎపిసోడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌- అన‌న్య పాండే జంట సంద‌డి చేయ‌నుంది.

ఇప్ప‌టికే వెబ్లో టీజ‌ర్లు హీట్ పుట్టిస్తున్నాయి. బాలీవుడ్ యువ‌నాయిక‌ల క‌ల‌ల రాకుమారుడిగా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ గురించిన ర‌క‌ర‌కాల ర‌హ‌స్యాలు కేజేవో షోలో బ‌య‌ట‌ప‌డ‌నున్నాయ‌ని అంతా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

ముఖ్యంగా విజ‌య్ పై ఎంత‌మంది బాలీవుడ్ భామ‌ల‌కు క్ర‌ష్ ఉంది? అన్న‌ది బ‌య‌ట‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే జాన్వీ క‌పూర్- సారా అలీఖాన్ త‌మ‌కు వీడీపై క్ర‌ష్ ఉంద‌ని గ‌త ఎపిసోడ్ లో అంగీక‌రించారు. ఇంతలోనే దేవ‌ర‌కొండ లైగ‌ర్ స‌హ‌నాయిక అన‌న్య పాండే కూడా వీరితో రేస్ లోకి చేరింది. తాజా ఎపిసోడ్ కి సంబంధించిన విజువ‌ల్ లో అన‌న్య‌కు ఇలాంటి ఒక ప్ర‌శ్న ఉంది.

విజయ్ దేవరకొండ దృష్టిని ఆకర్షించడానికి యువ‌నాయిక‌ల‌ మధ్య పోటీని `హంగర్ గేమ్స్` కంటిన్యూ అవుతున్నాయ‌ని అన‌న్య పాండే వ్యాఖ్యానించింది. అనన్య పాండే రేసులో వెనుకబడి ఉండకూడదని కూడా అంది. వీడీతో ప్రేమాయ‌ణం (గెస్) రేసులో నేను కూడా వారి (జాన్వీ-సారా)తో ప్లేట్ (రేస్)లో ఉండాలనుకుంటున్నాను. న‌న్ను ఎందుకో విడిచిపెట్టేశారు! అంటూ అనన్య పాండే తన మెరిసే క‌ళ్ల‌తో బాధగా చెప్పింది. ఇదంతా అన‌న్య‌లో ఫ‌న్నీ యాంగిల్. ఈ వీడియోలో వీడీ- అన‌న్య పాండే జంట ఎంతో స‌ర‌దాగా ఫ‌న్ తో అల‌రించారు.

కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో పాల్గొన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇప్పుడు నార్త్ లో అంతా ఇంతా క్రేజ్ కాదు. యువ‌త‌రం అసాధార‌ణంగా అత‌డిని అభిమానిస్తున్నారు. విజయ్ దేవరకొండ తెలివైన‌వాడు... వాస్త‌వాల‌ను మాట్లాడే నైజం ఉన్న యువ‌కుడు. త‌న‌పై క్రష్ ఉంద‌న్న సారా అలీఖాన్ మాట‌ల‌కు తెలివైన స‌మాధాన‌మిచ్చాడు. మీరు అలా అన్న‌ప్పుడు ఎంతో క్యూట్ గా ఉంటారు! అంటూ సారాను విజ‌య్ ప్ర‌శంసించాడు. అలాగే జాన్వీ - సారా మ‌ధ్య కాంపిటీష‌న్ చూసి దానికి త‌గ్గ‌ట్టుగానే త‌ట‌స్థంగా క‌నిపించాడు.

ప్రస్తుతానికి కెరీర్ పై దృష్టి సారించిన విజ‌య్ దేవ‌ర‌కొండ `హంగర్ గేమ్` లో పాల్గొనే భామ‌ల‌కు కాస్త దూరంగా ఉంటేనే మంచిద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వ‌రుస ప్రేమాయ‌ణాలతో ముగ్గులోకి దిగితే తిరిగి కోలుకోవ‌డం అంత సులువేమీ కాద‌ని తెలివైన వీడీ గ్ర‌హిస్తాడ‌నే అభిమానులు భావిస్తున్నారు. జాన్వీ- సారా- అన‌న్య‌ల‌తో ట్ర‌యాల‌జీ ప్రేమ‌క‌థ‌లకు తావిస్తే.. మ‌రీ అంత మంచిది కాదేమో!!