Begin typing your search above and press return to search.
'పోలీసులే అసలు హీరోలు' అంటున్న స్టార్ హీరో
By: Tupaki Desk | 11 April 2020 3:30 PM GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున తెలంగాణ పోలీసులకు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ధన్యవాదాలు తెలిపారు. సినీ పరిశ్రమలోని ప్రతిఒక్కరూ పోలీసులకు మద్దతుగా ఉంటారని విజయ్ చెప్పారు. తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను విజయ్ దేవరకొండ సందర్శించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారని విజయ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా విజయ్ పోలీసులను ఉద్దేశిస్తూ ఒక వీడియో సందేశం పంపించారు. ఈ వీడియోను డీజీపీ తెలంగాణ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పోలీసులకు ఉత్సాహానిచ్చేలా సందేశం ఇచ్చిన విజయ్ కి డీజీపీ మహేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
విజయ్ ఏమన్నాడంటే.. 'మీ అందరికీ(పోలీసులకు) థాంక్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. శాంతి భద్రతలు కాపాడటం మాత్రమే కాదు ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో నిత్యావసరాల సరకులు ప్రజలకు అందడంలో పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారు. నిత్యావసర వస్తువులను సరఫరా చేసే వారితో పోలీసుశాఖ సమావేశం కూడా నిర్వహించి తగు సూచనలు చేసింది. ప్రస్తుతం కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి నేను మాట్లాడుతున్నాను. మీ అందరి(పోలీసులు)కీ ఒకే ఒక్క పర్సనల్ మెసేజ్ ఇస్తున్నా. మేం స్కీన్ మీద హీరోలు కావొచ్చు..నిజంగా మీరందరూ మా హీరోలు. లాక్ డౌన్ మొదలై చాలా రోజులవుతోంది. మరో రెండు వారాలు లాక్ డౌన్ కొనసాగే ఛాన్స్ ఉంది. కానీ, మీరంతా ఎప్పుడూ అలసిపోవద్దు. పోలీసులందరూ ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉంటూ మన సమాజాన్ని - రాష్ట్రాన్ని - ప్రజలను కాపాడుతూ ఉండాలని' విజయ్ ఆకాంక్షించారు.