Begin typing your search above and press return to search.
ఏంటీ ఈ వేరియేషన్స్ దేవరకొండ?
By: Tupaki Desk | 20 Feb 2019 5:39 AM GMTఅర్జున్ రెడ్డి' చిత్రంలో ప్రేమించిన అమ్మాయి కోసం పిచ్చి వాడైన పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ ఆ వెంటనే 'గీత గోవిందం' చిత్రంలో చాలా సాఫ్ట్ గా - క్యూట్ గా కనిపించాడు. ఆ వెంటనే 'నోటా' చిత్రంలో పొలిటీషియన్ పాత్రతో 'నోటా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడు. డియర్ కామ్రేడ్ పూర్తి కాకుండానే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చిత్రంకు కమిట్ అయ్యాడు. ఆ సినిమాలో కూడా చాలా విభిన్నమైన సింగరేణి కార్మిక నాయకుడిగా - కాస్త ఏజ్డ్ పాత్రలో కనిపించబోతున్నాడు.
విభిన్నమైన వేరియేషన్స్ తో విజయ్ దేవరకొండ కనిపిస్తూ సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. ఈ సమయంలోనే ఏ యంగ్ హీరో కూడా చేయని సాహసం విజయ్ దేవరకొండ చేసేందుకు సిద్దం అయ్యాడు. 8 ఏళ్ల బాబుకు తండ్రిగా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. నలుగురు హీరోయిన్స్ నటించబోతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ 8 ఏళ్ల బాబుకు తండ్రిగా కనిపించబోతున్న నేపథ్యంలో అసలు కథ ఏమై ఉంటుందా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
క్రాంతి మాధవ్ తన ప్రతి సినిమాలో కూడా చాలా విభిన్నమైన కథాంశంను చూపించే ప్రయత్నం చేస్తాడు. ఓనమాలు మరియు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్ ఈసారి విజయ్ దేవరకొండతో అంతకు మించిన భిన్నమైన కథతో చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా రాశి ఖన్నా - ఐశ్వర్య రాజేష్ - ఇసబెల్లా - కేథరిన్ తెర్సా నటించనున్నారు. ఈ నలుగురిలో విజయ్ ఎవరితో రొమాన్స్ చేయనున్నాడనే విషయంపై కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి మూడు పదుల వయసు కూడా దాటకుండానే చాలా విభిన్నమైన పాత్రలను చేయడంతో పాటు, ఏకంగా తండ్రి పాత్రను కూడా చేసేందుకు ముందుకు రావడం నిజంగా అభినంద నీయంగా చెప్పుకోవచ్చు.