Begin typing your search above and press return to search.
అడ్డు అదుపు లేని గీత గోవిందులు
By: Tupaki Desk | 18 Aug 2018 10:55 AM GMTస్క్రీన్ మీదే కాదు తమ అల్లరికి టికెట్ కౌంటర్లు కూడా సరిపోవని ఋజువు చేస్తున్నారు గీత గోవిందులు. విడుదలకు ముందు నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ క్యారీ చేసిన ఈ మూవీ అంచనాలకు మించి పెర్ఫర్మ్ చేయటం చూసి ట్రేడ్ యమా ఖుషిగా ఉంది. అంతకుముందు వారాల్లో వచ్చిన సినిమాల్లో ఒక్క గూఢచారి తప్ప ఇంకేదీ మెప్పించేలా లేకపోవడంతో డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు గీత గోవిందం పుణ్యమా అని కొత్త జోష్ వచ్చేసింది. హాలిడే రోజుతో మొదలు పెట్టి వీక్ ఎండ్ దాకా నాన్ స్టాప్ దాకా దూసుకుపోతోంది. వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ ఐదు రోజుల్లో అధిక శాతం సెంటర్స్ లో ఈజీగా టికెట్స్ దొరకలేని పరిస్థితి ఉందంటే ప్రభంజనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఇదే పెద్ద హిట్ గా అవతరించబోతోంది. మూడు రోజులకు గాను 37 కోట్ల 45 లక్షల గ్రాస్ సాధించి మహామహులనే ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఒక్క నైజామ్ నుంచే 10 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి భవిషత్తుకు భారీ సంకేతాలు పంపుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇంకా ఫస్ట్ వీక్ కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి అర్జున్ రెడ్డిని దాటే అంచనాలు కొట్టిపారేయలేం. ఓవర్ సీస్ లో రేపటికంతా వన్ మిలియన్ మార్క్ లాంఛనం పూర్తయ్యేలా ఉంది. ఇక ఏరియాల వారీగా చూస్తే షాక్ కాక తప్పదు
నైజామ్ - 10 కోట్ల 20 లక్షలు
సీడెడ్ - 4 కోట్లు
వైజాగ్ - 3 కోట్ల 12 లక్షలు
కృష్ణా - 2 కోట్ల 10 లక్షలు
ఈస్ట్ గోదావరి - 2 కోట్ల 8 లక్షలు
వెస్ట్ గోదావరి - 1 కోటి 90 లక్షలు
గుంటూరు - 1 కోటి 90 లక్షలు
నెల్లూరు - 90 లక్షలు
ఏపీ/తెలంగాణ మొత్తం 3 రోజుల గ్రాస్ - 26 కోట్ల 40 లక్షలు
ఓవర్ సీస్ - 5 కోట్ల 60 లక్షలు
కర్ణాటక - 2 కోట్ల 50 లక్షలు
తమిళనాడు - 1 కోటి 79 లక్షలు
రెస్ట్ అఫ్ ఇండియా - 1 కోటి 11 లక్షలు
ప్రపంచవ్యాప్త 3 రోజుల గ్రాస్ - 37 కోట్ల 47 లక్షలు
ఇవి స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని వసూళ్లు. ఏ సెంటర్స్ తో పాటు మల్టీ ప్లెక్సుల్లో దీనికి దెబ్బ అవుతుందేమో అని భావించిన హిందీ సినిమా గోల్డ్ అనూహ్యంగా గీత గోవిందం వల్లే పంచ్ తింది. ఇక మరో బాలీవుడ్ మూవీ సత్యమేవ జయతే ఫలితం తెలిసిందే. దీంతో గీత గోవిందం ఈ వారం మొత్తాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. నిన్న శుక్రవారమే అయినప్పటికీ డబ్బింగ్ మూవీ ఝాన్సీ తప్ప ఇంకేదీ రాలేదు. సో ప్రేక్షకులకు హోల్ సేల్ గా మిగిలిన ఛాయస్ గీత గోవిందమే. ఫైనల్ రన్ పూర్తయ్యేలోపు తనకే కష్టమయ్యే రికార్డ్స్ సాధించేలా ఉన్నాడు విజయ్ దేవరకొండ.