Begin typing your search above and press return to search.
విజయ్ దేవరకొండ యాడ్ వైరల్
By: Tupaki Desk | 11 Dec 2018 11:37 AM GMTతెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ప్రభంజనం.. ప్రజా కూటమి ఘోర పరాభవం నేపథ్యంలో సోషల్ మీడియాలో జోకులు మామూలుగా పేలట్లేదు. కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే 7 ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుని చచ్చిపోతానంటూ బండ్ల గణేష్ సవాలు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అలాగే టీఆర్ ఎస్ ను ఓడించే వరకు గడ్డం తీయనంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సవాలు చేయడాన్ని కూడా గుర్తు చేసి జోకులు పేలుస్తున్నారు. ఇంకా సామాజిక మాధ్యమాల్లో బోలెడన్ని జోకులు పేలుతున్నాయి. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని క్రియేటివ్ యాడ్స్ రూపొందిస్తుండటం విశేషం. కళామందిర్ ఫ్యాషన్ మాల్ వాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజయ్ దేవరకొండను ముందు పెట్టి రూపొందించిన పేపర్ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్యాగ్రౌండ్లో గులాబీ రంగును పులిమేసి.. TRS అనే అక్షరాలు కలిసొచ్చేలా ‘Totally Rocking Styles’ అంటూ యాడ్ ఇచ్చింది కేఎల్ ఎం ఫ్యాషన్ మాల్ టీం. ఎక్కువ శాతం ప్రజల మద్దతున్న ఏకైక షాపింగ్ మాల్.. ఇది సామాన్యుల షాపింగ్ మాల్ అంటూ ఇంకో కొటేషన్ కూడా వేశారు పోస్టర్ మీద. మంచి టైమింగ్ తో ఈ యాడ్ రూపొందించడం.. పైగా యూత్ ఐకాన్ అయిన విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా ఉండటంతో ఈ యాడ్ వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. విజయ్ టీఆర్ ఎస్ అగ్ర నేత.. మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు బాగా క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. అతడిని టీఆర్ ఎస్ మద్దతుదారుగానే భావిస్తున్నారు జనాలు. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటోంది.