Begin typing your search above and press return to search.

పేరు మార్చుకుని కూడా బూతులే

By:  Tupaki Desk   |   7 Sept 2017 11:15 PM IST
పేరు మార్చుకుని కూడా బూతులే
X
డి.విజయసాయి అనేది పేరు. పైగా పుట్టపర్తిలోని సత్యసాయి బాబా రెసిడెన్షియల్ స్కూల్లో చదివాడు కాబట్టి.. అప్పట్లో అదే పెట్టుకున్నాడు. ఈ మధ్యన సినిమాల్లో మాత్రం విజయ్ సాయి దేవరకొండ అని వేసుకున్నాడు. కాని ఇండస్ర్టీలో అందరూ విజయ్ దేవరకొండ అని పిలువడం మొదలెట్టారు. దానితో మనోడికి కూడా ఆ కిక్ బాగా ఎక్కేసినట్లుంది. అందుకే తన పేరును తానే విజయ్ దేవరకొండ అని మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు.

పేరులో కేవలం ఒక పదాన్ని డ్రాప్ చేస్తున్నప్పుడు.. దాని గురించి పెద్దగా ప్రకటించాల్సిన అవసరం లేదు. మన తమన్నా వంటి స్టార్లు కూడా.. న్యూమరాలజీ ప్రకారం పేరును మార్చుకున్నారు. కాని ఈ దేవరకొండ విజయ సాయి మాత్రం.. తన ట్విట్టర్ హ్యాండిల్ ను 'ది దేవరకొండ' అని మార్చుకుంటున్నట్లు ప్రకటించి.. అందులో కూడా తన అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ చూపించాడు. ''@TheDeverakonda replaces @DVijaySai. DVijaySai reminds me of my text books in school. Am an actor now. Can cal myself whateverthefck I want'' అంటూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ విషయం మామూలుగా కూడా చెప్పొచ్చు కాని.. whateverthefck అనే పదం ఎందుకు వాడాడో తెలియదు.

అయితే ఇది అర్బన్ లింగో అంటూ కొందరు పాజిటివ్ గా తీసుకుంటే.. అబ్బే అర్జున్ రెడ్డి హిట్టవ్వడంతో కుర్రాడు కాస్త దూకుడు స్వభావం చూపిస్తున్నాడు అంటూ ఇతరులు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా బూతులు తిట్టేశాడు అంటున్నారు. చూద్దాం విజయ్ దీని గురించి రెస్పాండ్ అవుతాడో లేదంటే.. యథావిథిగా f**k హ్యుమిలిటీ అంటాడో!!