Begin typing your search above and press return to search.

'వీడీ' లైగర్ వర్సెస్ 'వీటీ' బాక్సర్!

By:  Tupaki Desk   |   17 Jan 2021 1:19 PM GMT
వీడీ లైగర్ వర్సెస్ వీటీ బాక్సర్!
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పోటీ పడబోతున్నారా? బాక్సింగ్ రింగ్ లో తమ ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నారా? అంటే.. అవుననే అంటున్నారు సినీజనాలు! ఈ ఇద్దరు హీరోల అప్ కమింగ్ మూవీస్, వాటికి సంబంధించిన అప్డేట్స్, వాటి విషయంలో మేకర్స్ స్పందిస్తున్న తీరు చూస్తుంటే.. ఇదే సందేహం కలుగుతోంది చాలా మందికి!

విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో రాబోతున్న ఈ మూవీని ఛార్మి, కరణ్ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఈ చిత్రానికి 'ఫైటర్' టైటిల్ ఫిక్స్ చేశాడు పూరీ. కానీ.. హిందీలో ఈ టైటిల్ అందుబాటులో లేదట. వేరేవాళ్లు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించడంతో పేరు మార్చక తప్పలేదు. దీంతో 'లైగర్' టైటిల్ ను ఫిక్స్ చేశాడు డాషింగ్ డైరెక్టర్. తెలుగు, హిందీతోపాటు ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. అయితే.. ఈ మూవీ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. రింగులో ప్రత్యర్థులను చిత్తుచేసే హీరోగా విజయ్ కనిపించబోతున్నాడీ సినిమాలో.

ఇక, వరుణ్‌ తేజ్‌ కథానాయకుడుగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. 'వీటీ10' వర్కింగ్‌ టైటిల్‌తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ కూడా బాక్సర్ గా కనిపించబోతున్నాడు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఈ చిత్రానికి 'బాక్సర్' టైటిల్ ఖరారు చేశారు. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు వెంకటేష్, సిద్ధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ కొనసాగుతోంది. ఈ మూవీద్వారా తనలోని మాస్ యాంగిల్ ను మరింత ఎలివేట్ చేయబోతున్నాడు వరుణ్. బాక్సింగ్ గ్లౌజ్ చేతికి వేసుకుంటే చాలు.. ప్రత్యర్థుల బాక్స్ బద్దలైపోవడం ఖాయమంటున్నాడు మెగా ప్రిన్స్.

ఇంత వరకూ బాగానే ఉన్నప్పటికీ.. ఈ రెండు సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కాంపిటేటివ్ వెదర్ ను క్రియేట్ చేశాయి. రెండూ చిత్రాలూ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండడం ఒకెత్తయితే.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు రెండు చిత్రాలూ పోటీ పడుతుండడం మరో ఎత్తు!

వరుణ్ తేజ్ 'వీటీ10' టైటిల్, ఫస్ట్ లుక్ నుంచి జనవరి 19న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది యూనిట్. మంగళవారం ఉదయం 10.10 గంటలకు విడుదల చేయబోతున్నాారు. ఈ మేరకు వరుణ్ తేజ్ తన ట్విటర్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు.

అయితే.. విజయ్ దేవరకొండ ఫైటర్ ఫస్ట్ లుక్ జనవరి 18వ తేదీనే రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది పూరీ టీం. సోమవారం ఉదయం 10.08 గంటలకు ఈ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని అనౌన్స్ చేసింది.

రెండూ ఒకే జోనర్ చిత్రాలు కావడం.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ఇద్దరూ పోటీ పడుతుండడంతో ఒక విధమైన పోటీ వాతావరణం నెలకొంది. ఒకే కథాంశం కాబట్టి, ముందుగా ప్రేక్షకులను ప్రసన్నం చేసుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి 'వీడీ' లైగర్ వర్సెస్ 'వీటీ' బాక్సర్ అన్నట్టుగా మారింది పరిస్థితి!