Begin typing your search above and press return to search.

నిజ‌మైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్న VD

By:  Tupaki Desk   |   25 Aug 2022 5:30 PM GMT
నిజ‌మైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్న VD
X
ఆన్ ద స్క్రీన్ ప్రేమించ‌డం వేరు.. ఆఫ్ ద స్క్రీన్ ప్రేమించ‌డం వేరు! ఈ రెండిటికీ ప్రాక్టిక‌ల్ గా చాలా వైరుధ్యాలున్నాయి. వెండితెర ప్రేమ‌క‌థ‌లు వేరు.. వాస్త‌వ జీవితంలో ప్రేమ‌క‌థ‌లు వేరు! ట్రూ ల‌వ్ అనేది ఎంతో మ‌ధురాతిమ‌ధుర‌మైన‌ది. ఆ అనుభూతిని అనుభ‌వించిన వారికి మాత్ర‌మే దానిలో డెప్త్ ఎంతో తెలుస్తుంది. అయితే అలాంటి డెప్త్ త‌న‌కు కూడా ఉందని అయితే అది చివ‌రికి విఫల ప్రేమ‌గా మారింద‌ని కూడా దేవ‌ర‌కొండ వెల్ల‌డించాడు.

విజయ్ దేవరకొండ సుదీర్ఘ కాలం త‌న లేడీ ల‌వ్ తో సంబంధంలో ఉన్నట్లు వెల్లడించాడు. ఆమె ప్రేమ దిశ మార్చుకుందని కూడా చెప్పాడు. విజయ్ దేవరకొండ ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడో అర్థం కాక‌పోయినా.. చాలామంది అతడు తన బెల్జియన్ గర్ల్ ఫ్రెండ్ విరిజిన్ గురించి మాట్లాడుతున్నాడని ఊహిస్తున్నారు.

ఇంకాస్త వివ‌రంగా వెళితే.. వృత్తిపరమైన జీవితంతో పాటు విజయ్ దేవరకొండ ఎల్లప్పుడూ తన వ్యక్తిగత జీవితంలో ర‌క‌ర‌కాల అంశాల‌తో హెడ్ లైన్స్ లోకొస్తున్నాడు. ఇప్పుడు మ‌రోసారి త‌న ల‌వ్ బ్రేక‌ప్ గురించి వెల్ల‌డించి చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాడు. విజ‌య్ త‌న ల‌వ్ లైఫ్ గురించి గ‌త ఇంట‌ర్వ్యూల్లో ఎప్పుడూ వెల్లడించలేదు. రష్మిక మంద‌న్నతో డేటింగ్ గురించి అంగీకరించలేదు. కానీ ఇప్పుడు అతడు సుదీర్ఘ సంబంధంలో ఉన్నట్లు అంగీకరించాడు. ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తాను నటుడిగా మారాక చాలా కాలం సంబంధం కలిగి ఉన్నానని తన హృదయం అప్పటివరకు బ్రేక్ అవ్వ‌లేద‌ని తెలిపాడు.

వీడీ ఎవ‌రి గురించి చెబుతున్నాడో అర్థం కాక‌పోయినా.. అతను 2018లో డేటింగ్ చేసిన‌ తన బెల్జియన్ గర్ల్ ఫ్రెండ్ విరిజిన్ గురించి మాట్లాడుతున్నాడని అంతా ఊహిస్తున్నారు. నిజానికి విదేశీ యువ‌తి వరిజిన్ తో విజ‌య్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజా ఇంట‌ర్వ్యూలో ల‌వ్ లైఫ్ గురించి తన తండ్రి తనకు నేర్పించిన ఒక సంగ‌తిని చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ తన ప్రేమ ఆలోచనను ఎలా మార్చుకుందో కూడా అత‌డు చెప్పాడు. విజ‌య్ మాట్లాడుతూ-''ఎదుగుతున్నప్పుడు మా నాన్న నాకు ప్రేమ ఒక‌ బుల్ షిట్ అని .. డబ్బు ఈ ప్రపంచానికి కేంద్రమని నాకు నేర్పించారు. డబ్బు ఉంటే మ‌న‌కు ప్రతిదీ ద‌క్కుతుంది. డబ్బు ఉంటేనే ప్రజలు నిన్ను ప్రేమిస్తారు.. గౌరవిస్తారు.. సాయం చేస్తారు!! అని చెప్పారు. ఇది నాలో ఎంతగా నాటుకుపోయిందంటే.. నేను పెద్దయ్యాక నాకు సంబంధాలపై నమ్మకం లేదు.. నా దగ్గరకు వచ్చిన వారందరూ కోరికతోనే వచ్చారని.. ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారని చెప్పినప్పుడు నేను ఎప్పుడూ నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అని చెప్పేవాడ‌ట‌. ఇప్ప‌టివరకు అది సహజంగా పుట్టుక రాలేద‌ని అంగీక‌రించాడు.

అంతేకాదు.. విజ‌య్ మాజీ స్నేహితురాలు అతని ప్రేమ ఆలోచనను మార్చింది. ''నటుడ‌య్యాక నాకు ప్రేమ గురించి చాలా నేర్పిన సుదీర్ఘ సంబంధం ఒక‌టి ఉంది. ఇది (ప్రేమ‌) అనేది ఒక‌ లావాదేవీ కాదని ప్రజలు మ‌న‌ల్ని నిస్వార్థంగా ప్రేమిస్తారని నేను గ్రహించాను. మా నాన్న అన్న‌ది ఏమిటో తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. అతను నాకు ఏమి నేర్పించాడో అర్థం చేసుకున్న విధానం తప్పు. కానీ నా వ‌ర‌కూ నేను ఇలా చెబుతాను.. నాన్న నేర్పిన‌ పాఠం నన్ను నేను ఉన్న ఈ చోటికి చేర్చింది. నేను కోరుకున్నదంతా నేను సాధించాను. కానీ దానికి(త‌న తండ్రి నేర్పిన దానికి) మంచి ధర ప‌లికింది''అన్నాడు.

చాలా కాలం క్రిత‌మే త‌మ‌ బంధం ముగిసిపోయిందని విజయ్ దేవరకొండ వెల్లడించారు. నేను స్నేహితులను కోల్పోయాను.. సంబంధాలను కోల్పోయాను.. నేను ఖర్చు పెట్టాను... ఇతర విషయాలలో మునిగిపోయే స్వేచ్ఛ నాకు లేదు... నేను దృష్టి కేంద్రీకరించవలసి వచ్చింది.. ఏమీ లేని ద‌శ‌ నుండి వచ్చి నటుడిని కావాలనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు పూర్తిగా లొంగదీసుకోండి. ఆమె స్వాధీనంలో ఉండొద్దు. నా దగ్గర ఏం ఉందో తెలుసుకునేప్ప‌టికి చాలా ఆలస్యం అయింది. నేను సంబంధాన్ని చాలా ప్రభావితం చేసాను. అది మాకు నష్టం కలిగించింది'' అని కూడా అన్నాడు.

విజయ్ దేవరకొండ 18 ఏళ్ల వరకు ఆడవాళ్లంటే విపరీతంగా భయపడేవాడిన‌ని కూడా తెలిపాడు. ఆడవాళ్లను చూసి మాట్లాడలేనంతగా చాలా భయపడేవాడిని అని షాకింగ్ విష‌యం చెప్పాడు. దేవరకొండ తన గురించి రెండు నిజాలు .. ఒక అబద్ధం చెప్పమని అడిగినప్పుడు అతను ఇలా అన్నాడు. నాకు దాదాపు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మహిళలంటే చాలా భయపడ్డాను అని అన్నాడు. ఒక స్త్రీని కళ్లలోకి చూసేందుకు లేదా మాట్లాడేందుకు నా దగ్గర ధైర్యం లేదు. కాబట్టి ఇది ఒక నిజం.

నేను బాలుర బోర్డింగ్ స్కూల్ లో పెరిగాను కాబట్టి మహిళలు వేరే జాతికి చెందిన వారని నేను అనుకున్నాను. అవి గ్రహాంతర జీవుల్లా అనిపించాయి. మీరంతా చాలా అందంగా ఉంటారు... ఇది చాలా కష్టం.. అని కూడా అన్నాడు. విజ‌య్ న‌టించిన 'లైగర్' సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో చాలా సంగ‌తులే చెబుతున్నాడు. తెలుగు మీడియాల‌కు చెప్పని నిజాల్ని జాతీయ మీడియాకి ఓపెన‌వుతున్నాడు వీడీ!