Begin typing your search above and press return to search.

దేవరకొండ హీరో బిసి వైపు చూడాలి?

By:  Tupaki Desk   |   27 July 2019 5:50 AM GMT
దేవరకొండ హీరో బిసి వైపు చూడాలి?
X
ఎన్నడూ లేని రీతిలో ఎవరూ చేయని విధంగా డియర్ కామ్రేడ్ కోసం అగ్రెసివ్ ప్రమోషన్ చేసిన విజయ్ దేవరకొండ దానికి తగ్గ ఫలితం అందుకునేలా కనిపించడం లేదు. డివైడ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుండటంతో దాని ప్రభావం వీకెండ్ తర్వాత బాగా పడేలా ఉంది. ఇప్పటిదాకా యూత్ అండదండలతో ఫాలోయింగ్ తో నెట్టుకొస్తున్న విజయ్ ఇకపై స్టార్ స్టేటస్ ని సుస్థిరపరుచుకోవాలి అంటే మాస్ కంటెంట్ ఉన్న కథల పై ఫోకస్ పెట్టాలి. అలా అని ఇప్పటికిప్పుడు ఇస్మార్ట్ శంకర్ లాంటి సబ్జెక్ట్స్ ని ఎంచుకోమని కాదు.

అన్ని వర్గాలకు కనెక్ట్ అవుతూ బిసి సెంటర్స్ లో ఆడియన్స్ ని మెప్పించే అంశాలున్నా స్టోరీస్ వైపు ఫోకస్ చేయడమన్న మాట. ఉదాహరణకు పవన్ తమ్ముడు-అత్తారింటికి దారేది మహేష్ బాబు అతడు లాంటి సినిమాలు క్లాస్ గా ఉంటూనే మాసాలాలు అందిస్తూ హిట్టు కొట్టినవి. కానీ విజయ్ దేవరకొండ ఇప్పటిదాకా కేవలం లవ్ స్టోరీస్ మాత్రం చేస్తూ వచ్చాడు. డియర్ కామ్రేడ్ పేరుకు మెసేజ్ ఉన్నట్టు చివర్లో అనిపించినా ఫైనల్ గా ఇదీ పక్కా లవ్ స్టోరీనే. టేకింగ్ లోపాల వల్ల టాక్ వేరుగా వస్తోంది కానీ కంటెంట్ మెప్పించేలా ఉంటే ఫలితం ఇంకోలా ఉండేది.

ఇకపై విజయ్ దేవరకొండ తన నుంచి యూత్ కోరుకుంటున్న అంశాలకు ప్రాధాన్యం ఇస్తూనే మాస్ సెంటర్స్ లో తన సినిమా చూడొచ్చు అనిపించేలా స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఎంతసేపూ అర్జున్ రెడ్డి తరహా క్యారెక్టర్ హ్యాంగోవర్లో ఉంటూ ప్రతి కథను అదే యాంగిల్ లో డిజైన్ చేయించుకుంటే ఇది మొహం మొత్తే రోజులు ఎంతో దూరంలో లేవు. డియర్ కామ్రేడ్ ఒకరకంగా వార్నింగ్ బెల్ కూడా అనుకోవచ్చు. మరి బిసి సెంటర్స్ వైపు విజయ్ చూపు ఎప్పుడు మళ్లుతుందో వేచి చూడాలి