Begin typing your search above and press return to search.

కెరీర్ టాక్సీ ఆగకుండా చూసుకోవాలి!

By:  Tupaki Desk   |   22 Nov 2018 1:30 AM GMT
కెరీర్ టాక్సీ ఆగకుండా చూసుకోవాలి!
X
శుక్రమహర్దశ అంటే అర్థం తెలుసుకోవాలి అంటే విజయ్ దేవరకొండని చూస్తే చాలు ఇంకే ఉదాహరణ అక్కర్లేదు. కేవలం మూడేళ్ళలో బాక్స్ ఆఫీస్ దగ్గర బెస్ట్ ఓపెనర్ గా పేరు తెచ్చుకోవడం అంటే మాములు విషయం కాదు. పెళ్లి చూపులు ఒక్కదాన్ని పక్కన పెడితే అర్జున్ రెడ్డితో ప్రారంభించి టాక్సీవాలా దాకా విజయ్ దేవరకొండ ఇమేజ్ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. సినిమా సక్సెస్ లలో తన షేర్ పెరుగుతోంది. యూత్ లో ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో సినిమా హాల్ లో విజయ్ ఇంట్రోలో కేకలు ఈలలను బట్టి అర్థం చేసుకోవచ్చు. బుకింగ్ కౌంటర్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి.

అంటే అది కేవలం సినిమాలో మ్యాటర్ వల్లే కాదు విజయ్ అనే బ్రాండ్ కూడా దానికి కారణం. కాని విజయ్ దేవరకొండ మీద మెల్లగా కామెంట్స్ కూడా మొదలవుతున్నాయి. ఒకే తరహా యాక్టింగ్ తో పెద్దగా వైరుధ్యం లేకుండా కొంత మొనాటనీగా విజయ్ వెళ్తున్నాడన్న చర్చ సోషల్ మీడియాలో సైతం మొదలైంది. నిజానికి ఏ హీరోకైనా లాంగ్ రన్ కెరీర్ నిలవాలి అంటే ఛాలెంజింగ్ పాత్రలు చాలా అవసరం. కాని విజయ్ ఒకే టెంప్లెట్ లో నటిస్తూ పోవడం ముందు ముందు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. నోటా ఫ్లాప్ సంగతి పక్కన పెడితే అందులో హీరో పాత్ర ముఖ్యమంత్రి కొడుకుగా కాని ఒక పొలిటీషియన్ గా కాని కనపడదు. కేవలం జాలీగా తిరుగుతూ దేన్నీ సీరియస్ గా తీసుకొని ఓ యువకుడే కనిపిస్తాడు. గీత గోవిందం పాత్ర తీరే అంత కాబట్టి అదేమీ లోపంగా అనిపించలేదు. అందులోనూ రష్మిక మందన్న సమాన స్థాయి పాత్ర చేసింది కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు.

కాని టాక్సీవాలా ఎంత పెద్ద హిట్ అయినా విజయ్ దేవరకొండ నటన పరంగా ఎక్కువ ఫోకస్ పెట్టి విభిన్నమైన కథలను ఎంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. నాని సైతం ఇలాంటి పీక్స్ ని చూసినవాడే. అదే మైనస్ గా మారి కృష్ణార్జున యుద్ధం-దేవదాస్ ఫలితాల ద్వారా అతనికి హెచ్చరికలా పనిచేశాయి. అందుకే కొత్త మేకోవర్ తో జెర్సికి రెడీ అవుతున్నాడు. సో విజయ్ దేవరకొండ ముందున్న టాస్క్ కమర్షియల్ సూత్రాలకు లోబడుతునే తనలో నటుడికి సవాల్ విసిరే పాత్రలు ఎంచుకోవడం. అప్పుడే స్టార్ డం ఇంకొన్ని మెట్లు ఎక్కేస్తుంది.