Begin typing your search above and press return to search.

రౌడీ క్ల‌బ్ లో ఈ అరాచ‌క‌మేంటి కొండా?

By:  Tupaki Desk   |   13 Jan 2022 5:11 PM GMT
రౌడీ క్ల‌బ్ లో ఈ అరాచ‌క‌మేంటి కొండా?
X
టాలీవుడ్ సంచలనం విజ‌య్ దేవ‌ర‌కొండ‌ లైగర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టులో ఈ పాన్ ఇండియా చిత్రం విడుద‌ల కానుంది. విజయ్ దేవరకొండ మరోవైపు ఎంట‌ర్ ప్రెన్యూర్ గా ఫ్యాష‌నిస్టాగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు ప‌లు బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్ గానూ కొన‌సాగుతున్నారు. ఇప్పుడు తన దుస్తుల బ్రాండ్ `ది రౌడీ క్లబ్` గురించి కొత్త విషయాన్ని ప్రకటించాడు.

విజయ్ దేవరకొండ 2022లో విభిన్న డిజైన్ లతో కూడిన కొత్త దుస్తుల సేకరణను విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఒక చిన్న ప్రోమోను విడుదల చేశారు. వీడియోలో అతను ధరించిన డిజైన‌ర్ హూడీ ఇప్పటికే ది రౌడీ క్లబ్ వెబ్ సైట్ లో అమ్మకానికి ఉంది. విజయ్ దేవరకొండ తన దుస్తుల బ్రాండ్ ను పరిచయం చేయాలనే ఆలోచనతో వచ్చిన మొదటి తెలుగు నటుడు.. 2018లో ది రౌడీ క్లబ్ ను ప్రారంభించాడు. వ్యాపారం విజ‌య‌వంతంగా సాగుతోంది.

మ‌రోవైపు థియేట‌ర్ల రంగంలోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ దూసుకెళుతున్నాడు. ఏషియ‌న్ సినిమాస్ తో క‌లిసి ఏవీడీ సినిమాస్ పేరుతో థియేట‌ర్ల వ్యాపార‌ రంగంలోనూ ప్ర‌వేశించారు. ఇంత‌కుముందే ఓ మ‌ల్టీప్లెక్స్ ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిన‌దే. లైగ‌ర్ తో పాన్ ఇండియా స్టార్ గా స‌క్సెసైతే అత‌డి స్థాయి మ‌రో లెవ‌ల్ కి చేరుకుంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.