Begin typing your search above and press return to search.
'నోటా' కు ఇదే హైలైట్ అంటా..!
By: Tupaki Desk | 14 Sep 2018 12:19 PM GMT‘గీత గోవిందం’ చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ త్వరలో ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. దసరా కానుకగా ఈచిత్రాన్ని అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రకటించాడు. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో ఆలోచనలో పడ్డట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. సినిమా విడుదల తేదీ విషయం ఏమో కాని ప్రస్తుతం ఈ చిత్రంకు హైలైట్ చివరి 20 నిమిషాలు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
‘నోటా’ ట్రైలర్ లో విజయ్ దేవరకొండ సీఎంగా కనిపించబోతున్నట్లుగా చూపించారు. అయితే సినిమాలో విజయ్ పూర్తి స్థాయి సీఎంగా కనిపించడట. కేవలం చివరి 20 నిమిషాల్లో మాత్రమే విజయ్ సీఎంగా కనిపిస్తాడంటూ చిత్ర యూనిట్ సభ్యుల నుండి అనధికారిక సమాచారం అందుతుంది. విజయ్ సీఎంగా ఉన్నంత సేపు సినిమా స్థాయి పీక్స్ లో ఉంటుందని - అందరిని అలరించే విధంగా క్లైమాక్స్ సీన్స్ ఉంటాయంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమాలోని ప్రతి సీన్ కూడా సాదారణ ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా తమిళంలో పెద్దగా రాణించలేక పోయాడు. కాని ‘నోటా’ జోరు చూస్తుంటే మాత్రం విజయ్ దేవరకొండకు అక్కడ మంచి ఓపెనింగ్క్ దక్కడంతో పాటు కోలీవుడ్‌లో విజయ్‌కి చోటు కల్పించే అవకాశం ఉందనిపిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న ఈ దర్శకుడు ‘నోటా’తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.