Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: పాన్ ఇండియా రౌడీ స్టార్

By:  Tupaki Desk   |   10 Dec 2019 1:30 AM GMT
ట్రెండీ టాక్‌: పాన్ ఇండియా రౌడీ స్టార్
X
రౌడీ బోయ్ విజ‌య్‌ దేవ‌ర‌కొండ యాటిట్యూడ్ పై గ‌త కొంత‌కాలంగా ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. రౌడీలో ఏదో మార్పు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆ మార్పు ఏంటో స్ప‌ష్టంగా అర్థం కావ‌డం లేదు. ఏదో తేడా కొడుతోంది!! అంటూ ఇండ‌స్ట్రీ స‌హా అభిమానుల్లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

విజ‌య్ వైఖ‌రి అసాంతం మారింది. డియ‌ర్ కామ్రేడ్ ప్ర‌మోష‌న్స్ టైమ్ లో క‌ర‌ణ్ ని క‌లిసినప్పుడే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేందుకు త‌న‌వంతుగా ప్ర‌య‌త్నిస్తున్నాడని... అందుకు పెద్ద స్కెచ్ వేశాడ‌ని .. ఆ శుభవార్త రావ‌డానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని ఊహాగానాల్ని తుపాకి ఎక్స్ క్లూజివ్ గా గెస్ చేసింది. దేవ‌ర‌కొండ ముంబై విజిట్స్ ఫోటోల్ని జ‌ల్లెడ ప‌ట్టి ఎక్స్ క్లూజివ్ గానే ఈ సంగ‌తిని ఇంత‌కుముందే రివీల్ చేశాం. మొత్తానికి ఆ గెస్ నిజ‌మైంది. ఊహించినంతా అయ్యింది. విజ‌య్ త‌న కెరీర్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లే సాహ‌సం చేస్తున్నాడు. ఈసారి పూరి ద‌ర్శ‌క‌త్వంలో అత‌డు న‌టించ‌నున్న `ఫైట‌ర్` తెలుగు ఆడియెన్ కే కాదు.. హిందీ ఆడియెన్ కి షాకివ్వ‌బోతోంది. ప్ర‌భాస్ త‌ర్వాత మ‌రో పాన్ ఇండియా స్టార్ పుట్టుకొచ్చాడ‌న్న సిగ్న‌ల్ ఇవ్వ‌బోతోంది.

ఇక తెలుగు-హిందీతో పాటు ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లోనూ ఈ సినిమా రిలీజ‌య్యే అవ‌కాశం ఉంది. ఇక ప్ర‌భాస్ నటించిన బాహుబ‌లి చిత్రాన్ని ఉత్త‌రాదిన పంపిణీ చేసిన ది గ్రేట్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ప్ర‌స్తుతం దేవ‌ర‌కొండ‌ను హిందీలో ప్ర‌మోట్ చేసే ప‌నిలో ఉన్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ - ఛార్మి బృందంతో క‌లిసి క‌ర‌ణ్ జోహార్ విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

పూరిపై ఇటు టాలీవుడ్ స‌హా అటు బాలీవుడ్ లోనూ అంతే గురి ఉంది. ఇంత‌కుముందు అత‌డు తెర‌కెక్కించిన పోకిరి చిత్రం స‌ల్మాన్ హీరోగా వాంటెడ్ పేరుతో రీమేకై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత అమితాబ్ హీరోగా పూరి తెర‌కెక్కించిన బుడ్డా హోగా తేరా బాప్ బాలీవుడ్ లో ఘ‌న‌విజ‌యం అందుకుంది. అందుకే పూరితో అల‌యెన్స్ కి క‌ర‌ణ్ జోహార్ ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. ఇక క‌ర‌ణ్ తో డీల్ మాట్లాడేందుకే అప్ప‌ట్లో విజ‌య్ దేవ‌ర‌కొండ రెండు మూడు వారాల పాటు ముంబైలోనే పాగా వేశాడు. ఆ స‌మ‌యంలో అత‌డితో పాటు ఛార్మి కూడా ముంబైలోనే చ‌క్క‌ర్లు కొట్టింద‌ని తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. తాజాగా పూరి - ఛార్మి బృందం ఇప్ప‌టికే క‌ర‌ణ్ తో డీల్ పై సంత‌కం చేశార‌న్న స‌మాచారం అందుతోంది.

మొత్తానికి విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్ లో అదిరిపోయే ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. మ‌న మాస్ పూరి స్టైల్ కి హిందీ ఆడియెన్ స్పెల్ బౌండ్ అయిపోవ‌డం ఖాయం. అక్క‌డ కూడా మ‌రో ఇస్మార్ట్ ట్రీటిస్తాడ‌నే అభిమానులు భావిస్తున్నారు. ఇక ధ‌ర్మ‌ప్రొడ‌క్ష‌న్స్ అధినేత అండ‌దండ‌లే త‌న‌కు ఉన్న‌ప్పుడు రౌడీ గారి ఎంట్రీ ఓ లెవ‌ల్లోనే ఉండ‌నుంద‌న్న టాక్ అభిమానుల్లో వైర‌ల్ గా మారుతోంది. క‌చ్ఛితంగా ఇది మ‌రో లెవ‌ల్ సినిమా. రౌడీని మ‌రో హైట్ కి తీసుకెళ్లే ప్ర‌య‌త్న‌మేన‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు!