Begin typing your search above and press return to search.
రౌడీస్టార్ మల్టీప్లెక్స్ ఓనర్ అయ్యాడు!
By: Tupaki Desk | 20 Sep 2021 11:33 AM GMTవిజయ్ దేవరకొండ ఎలాంటి సినీ నేపథ్యంలో లేకుండానే ట్యాలెంట్ తో పెద్ద స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. మాస్ రాజా రవితేజ..నేచురల్ స్టార్ నాని తర్వాత స్వయంకృషితో ఎదిగిన నటుడు. అయితే వీళ్లిద్దరికంటే విజయ్ కి లక్ బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఎన్నో ఏళ్లు శ్రమిస్తే రాని గుర్తింపు దేవరకొండకి అనతి కాలంలోనే దక్కింది. ఆ రకంగా విజయ్ లక్కీ ఫెలో అనే అనాలి. పెళ్లి చూపులతో మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు బాలీవుడ్ కి పాకింది. పాన్ ఇండియా రేంజ్ సినిమా చేసే స్థాయికి రీచ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో విజయ్ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు.
విజయ్ స్వస్థలం మహబూబ్ నగర్ లో సొంతంగా మల్టీప్లెక్స్ నిర్మించారు. ఏషియాన్ సినిమాస్ భాగస్వామ్యంతో ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు. దీనికి ఏషియన్ విజయ్ దేవరకొండ(ఏవీడీ) అని నామకరణం చేసారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విజయ్ దేవరకొండ రిలీజ్ చేసారు. సినిమా నటుడ్ని అవ్వాలన్నది నా కల. అయ్యాను. ఇప్పుడు అక్కడ నుంచి సొంతంగా ఓ మల్టీప్లెక్స్ కి యజమానిగా మారాను.ఈనెల 24 మల్టీప్లెక్స్ లాంచ్ అవుతుంది. మొదట నాగచైతన్య-శేఖర్ కమ్ములా కాంబినేషన్ లో తెరకెక్కిన `లవ్ స్టోరీ` సినిమాతో లాంచ్ అవుతుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది అని విజయ్ తెలిపారు.
తొలుత టాలీవుడ్ నుంచి మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి సూపర్ స్టార్ మహేష్ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన ఏషియాన్ సంస్థలో టై అప్ అయి ఏఎంబీ మాల్ ని గచ్చిబౌలీలో నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో అందులో మల్టీప్లెక్స్ ని ఏర్పాటు చేసారు. ఇతర హీరోలు వేర్వేరు వ్యాపారాలు చేస్తున్నప్పటికీ సూపర్ స్టార్ మాత్రం సినిమా రంగంలోనే వ్యాపారాన్ని ఎంచుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో విజయ్ దేవరకొండ నిలవడం విశేషం.