Begin typing your search above and press return to search.
ఆ రెండు ఈవెంట్లతో కామ్రేడ్ హంగామా!
By: Tupaki Desk | 7 July 2019 11:51 AM GMT2019 సెకండాఫ్ ని `ఓ బేబి` ఘనంగానే ఆరంభించిందన్న ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా తర్వాత వరుసగా పలు క్రేజీ చిత్రాలు టాలీవుడ్ లో రిలీజ్ కానున్నాయి. వీటిలో విజయ్ దేవరకొండ నటిస్తున్న `డియర్ కామ్రేడ్` రిలీజ్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈనెల 26న సినిమా రిలీజ్ కానుంది.
గీత గోవిందం- టాక్సీవాలా లాంటి సక్సెస్ ల తర్వాత దేవరకొండ పూర్తిగా కాన్ సన్ ట్రేట్ చేసి చేస్తున్న చిత్రమిది. కాకినాడ నేపథ్యంలో సాగే స్టూడెంట్ లవ్ రివల్యూషన్ స్టోరి ఇదని ప్రచారమవుతోంది. కాకినాడ పరిసరాల్లోనే మెజారిటీ పార్ట్ చిత్రీకరణ సాగింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. రిలీజ్ దగ్గర పడుతోంది కాబట్టి.. దేవరకొండ తో కలిసి మైత్రి సంస్థ ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకూ ఇతర సినిమాలతో పోలిస్తే కామ్రేడ్ ప్రచారం పరంగా వెనకబడిన సంగతి తెలిసిందే. అందుకే ఇకపై ప్రచారార్భాటంతో టాలీవుడ్ సర్కిల్స్ లో వేడి పెంచేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈనెల 20న డియర్ కామ్రేడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతకంటే ముందే ఆంధ్రాలో ఓ ప్రమోషనల్ ఈవెంట్ ని నిర్వహించనున్నారట. జూలై 18న విజయవాడ పీవీఆర్ మాల్ లో వేడుక ప్లాన్ చేశారని తెలుస్తోంది. అలాగే విశాఖ .. తిరుపతి లోనూ ప్రచార కార్యక్రమాలతో హీటెక్కిస్తాడట కామ్రేడ్.
డియర్ కామ్రేడ్ ప్రచారానికి సంబంధించిన బాధ్యతలు విజయ్ దేవరకొండ తీసుకున్నారని... ఆ క్రమంలోనే ఇరు రాష్ట్రాల్లో ప్రమోషనల్ యాక్టివిటీస్ ని తనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. డియర్ కామ్రేడ్ తర్వాత మైత్రి సంస్థలోనే దేవరకొండ `హీరో` అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే డియర్ కామ్రేడ్ .. హీరో చిత్రాల్ని సూపర్ హిట్ చేయడమే ధ్యేయంగా దేవరకొండ అన్ని రకాలుగా మైత్రి సంస్థకు సహకారం అందిస్తున్నారట. ఓవైపు హీరో చిత్రీకరణ వేగంగా పూర్తి చేస్తూనే డియర్ కామ్రేడ్ రిలీజ్ ప్రమోషన్స్ పైనా దేవరకొండ దృష్టి సారించారు. మైత్రి సంస్థ హీరోతో కలిసి ప్రచారం పరంగా వేడి పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.