Begin typing your search above and press return to search.

ఇంకా 'హీరో' ఏంటి? 'స్టార్ హీరో' క‌దా!

By:  Tupaki Desk   |   30 Jun 2019 5:31 AM GMT
ఇంకా హీరో ఏంటి? స్టార్ హీరో క‌దా!
X
హీరోకి.. స్టార్ హీరోకి డిఫ‌రెన్స్ ఎలా చూస్తారు? ఏఏ ప్ర‌మాణాలు చూడాలి? సినిమా బ‌డ్జెట్.. ఫ్యాన్ ఫాలోయింగ్.. సాధించే వ‌సూళ్లు.. స‌క్సెస్ రేటు.. అందుకునే పారితోషికం .. ఇలా అన్ని కోణాల్లోనూ ప‌రిశీలిస్తే హీరో ఎవ‌రు? స్టార్ హీరో ఎవ‌రు? అన్న‌ది చెప్పొచ్చు. టాలీవుడ్ లో డ‌జ‌ను పైగా స్టార్ హీరోలు ఉంటే అందులో అర‌డ‌జ‌ను సీనియ‌ర్ హీరోలు.. అర‌డ‌జ‌ను పైగా యంగ్ డైన‌మిక్ స్టార్ హీరోలు ఉన్నారు. మ‌హేష్‌- ప్ర‌భాస్- రామ్ చ‌ర‌ణ్- ఎన్టీఆర్- అల్లు అర్జున్ ఇలా ఐదారు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తాయి.

ఆ త‌ర్వాత జ‌న‌రేష‌న్ లో ప‌రిశీలిస్తే నాని- శ‌ర్వానంద్ లాంటి యంగ్ డైన‌మిక్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. మ‌రి విజ‌య్ దేవ‌ర‌కొండ లెవ‌ల్ ఎంత‌? అంటే ఇప్పుడు అత‌డి స్థాయి అగ్ర హీరోల‌కు ఏమాత్రం తీసిపోవ‌డం లేద‌నే చెప్పాలి. దేవ‌ర‌కొండ న‌టించిన `గీత గోవిందం` వంద కోట్ల క్ల‌బ్ లో చేరింది. అంటే పై ఐదారు మంది స్టార్ హీరోల రేంజుకు కూత‌వేటు దూరంలోనే ఉన్నాడు. అయితే గీత గోవిందం రేంజును ఇక‌పైనా కంటిన్యూ చేస్తే .. అత‌డి పారితోషికం రేంజు ఇంకా స్కైలోకి వెళుతుంది. ఇప్ప‌టికే 10 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్న హీరోల జాబితాలో దేవ‌ర‌కొండ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

పైగా అత‌డు న‌టిస్తున్న తాజా ద్విభాషా(తెలుగు-త‌మిళం) చిత్రానికి ఏకంగా 50కోట్ల బ‌డ్జెట్ పెడుతుండ‌డం చూస్తుంటే అత‌డి రేంజు స్టార్ హీరో రేంజు అని అంగీక‌రించాల్సిందే. పోకిరి.. గ్యాంగ్ లీడ‌ర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు సాధించిన‌ వ‌సూళ్ల‌ను మించిన పెట్టుబ‌డిని దేవ‌ర‌కొండ‌ను న‌మ్మి పెడుతున్నారంటే అర్థం చేసుకోవాలి. 50-100 కోట్ల మ‌ధ్య వ‌సూళ్లను తేగ‌లిగే స‌త్తా ఉంద‌ని న‌మ్మితేనే ఇంత పెట్ట‌గ‌ల‌రు. డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న `హీరో` సినిమాకి 50 కోట్ల బ‌డ్జెట్ పెడుతుండ‌డం హాట్ టాపిక్. ఇందులో కేవ‌లం ఓ రెండు బైక్‌ రేసింగ్ సీన్ల‌కే రూ.10 కోట్లు ఖర్చు చేశారట. ఫార్ములా-1 ట్రాక్‌ కోసం ఖ‌ర్చు త‌డిసి మోపెడైంద‌ట‌. అలానే యాక్ష‌న్ సీన్స్ కి విదేశీ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ లను.. కాస్ట్‌ లీ బైక్‌ లు దించ‌డంతో ఇంత బ‌డ్జెట్ పెట్టాల్సొచ్చింది. డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత వెంట‌నే దేవ‌ర‌కొండ‌నే న‌మ్మి భారీ బ‌డ్జెట్ తో సినిమా చేస్తున్న మైత్రి మూవీ మేక‌ర్స్ గ‌ట్స్ ని మెచ్చుకుని తీరాలన్న ముచ్చ‌టా సాగుతోంది. దేవ‌ర‌కొండ‌ను హీరోని కాదు స్టార్ హీరోని చూస్తోంది మైత్రి సంస్థ‌. అగ్ర హీరోల సినిమాల్ని సైతం కాద‌నుకుని దేవ‌ర‌కొండతోనే ఆ సంస్థ వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది.