Begin typing your search above and press return to search.
రౌడీ పాలసీ.. ప్రేక్షకులకు నచ్చలేదా వదిలేద్దాం!
By: Tupaki Desk | 4 Aug 2019 9:12 AM GMTవిజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘డియర్ కామ్రేడ్’ మంచి సినిమాలాగే కనిపిస్తుంది కానీ.. ప్రేక్షకులకు అదంతగా రుచించలేదు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలి వారాంతంలో ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. కానీ వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేదు. విడుదలైన నాలుగైదు రోజులకే మరీ థియేటర్ల రెంట్లు కూడా రాని పరిస్థితి కొన్ని చోట్ల ఉందంటే ఈ సినిమా ఎటు వైపు అడుగులేస్తోందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిపోయినట్లే కనిపిస్తోంది. ఐతే వీకెండ్ అయ్యాక సినిమాను చిత్ర బృందం అసలేమాత్రం ప్రమోట్ చేేయకపోవడం ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ చప్పుడే లేకుండా ఉండిపోవడం విడ్డూరం. సినిమాకు డివైడ్ టాక్ ఉన్నపుడు దాన్ని ప్రమోషన్ల ద్వారా నిలబెట్టే ప్రయత్నం చేయడం విజయ్ బాధ్యత. కానీ అతను రిలీజైన రెండో రోజు ఒక ప్రెస్ మీట్లో పాల్గొని తర్వాత సైలెంటైపోయాడు. మామూలుగా తన సినిమాల్ని చాలా బాగా ప్రమోట్ చేసుకుంటాడని పేరున్న విజయ్.. ఈ చిత్రాన్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేయలేదన్నది ప్రశ్నార్థకం.
ఐతే ఈ విషయంలో విజయ్‌కి ఒక పాలసీ ఉందని అంటున్నారు అతడి సన్నిహితులు. ప్రేక్షకులకు సినిమా రుచించలేదంటే దాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దన్ని విజయ్ ఆలోచన అట. ఇంతకుముందు ‘ద్వారక’ సినిమా రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్ లో పాల్గొని ప్రేక్షకుల్ని నిరాశ పరిచినందుకు సారీ అని చెప్పి చిత్ర బృందానికి షాకిచ్చాడతను. ఇక తాను కెరీర్ ఆరంభంలో నటించిన ‘ఏ మంత్రం వేసావె’ అనే చెత్త సినిమా ఒకటి రిలీజైతే దాని ప్రమోషన్లకే హాజరు కాలేదతను. ‘నోటా’కు డిజాస్టర్ టాక్ వస్తే దాన్ని కూడా రిలీజ్ తర్వాత ప్రమోట్ చేయలేదు. ప్రేక్షకులకు ఒక సినిమా పట్ల ఆసక్తి లేనపుడు, వాళ్లకు సినిమా నచ్చలేదన్నపుడు దాన్ని ప్రమోట్ చేసి వాళ్లపై రుద్దకూడదన్నది విజయ్ ఉద్దేశమని.. అందుకే ‘డియర్ కామ్రేడ్’ ఫలితం మీద ఒక అంచనాకు వచ్చేసిన విజయ్.. దాని గురించి మాట్లాడ్డం మానేేశాడని అంటున్నారు.