Begin typing your search above and press return to search.

ఆ మాటలకు అర్థం ఏంటీ విజయ్‌..?

By:  Tupaki Desk   |   5 Oct 2018 5:59 PM GMT
ఆ మాటలకు అర్థం ఏంటీ విజయ్‌..?
X
ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఎక్కడ చూసినా - ఎక్కడ విన్నా కూడా విజయ్‌ దేవరకొండ ముచ్చట్లు. ప్రస్తుతం యూత్‌ ఐకాన్‌ గా మారిపోయిన విజయ్‌ దేవరకొండ తాజాగా ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ‘గీత గోవిందం’ చిత్రం విడుదల తర్వాత విజయ్‌ దేవరకొండకు సంబంధించిన కొన్ని ఫొటోలో సోషల్‌ మీడియాలో కనిపించాయి. ఆ ఫొటోల్లో ఒక ఫారిన్‌ అమ్మాయితో విజయ్‌ చాలా క్లోజ్‌ గా ఉన్నాడు. అప్పుడు ఆ ఫొటోలు ఒక షార్ట్‌ ఫిల్మ్‌ కోసం తీసినవి అంటూ విజయ్‌ పీఆర్‌ టీం చెప్పడం జరిగింది.

తాజాగా విజయ్‌ దేవరకొండను మరోసారి మీడియా మిత్రులు ఆ ఫొటోల గురించి ప్రశ్నించిన సమయంలో ఇచ్చిన సమాధానం కాస్త అనుమానాలకు తెర లేపుతుంది. ఆ ఫొటోలు ఏదో షూట్‌ సందర్బంగా అంటూ చెబితే అంతా కూడా ఊరుకుండే వారు. కాని విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ఆ ఫొటోలు మార్ఫింగ్‌ - అందులో ఉన్నది నేను కాదు అనే సొల్లు ముచ్చట్లు నేను చెప్పను. అందులో ఉన్నది నేనే అంటూ కుండబద్దలు కొట్టేశాడు.

ఆ ఫొటోల్లో ఉన్న అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఆమె గురించి మీరు ఎంత త్వరగా మర్చి పోతే బెటర్‌. మీరు ఈ విషయాన్ని త్వరగా మర్చి పోవాలని కోరుకుంటున్నాను అన్నాడు. విజయ్‌ దేవరకొండ మాటల వెనుక అర్థం వెదికే పనిలో సోషల్‌ మీడియా జనాలు పడ్డారు. ఆమె గురించి మర్చిపోండి అన్నాడు అంటే ఆమెతో విజయ్‌ కి లవ్‌ అఫైర్‌ నడుస్తుందా లేదంటే అప్పుడు నడిచి ఇప్పుడు బ్రేకప్‌ అయ్యిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విజయ్‌ దేవరకొండ సమాధానం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది.