Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా.. రౌడీ నెక్ట్స్ టార్గెట్
By: Tupaki Desk | 10 Sep 2019 3:30 AM GMTఇటీవల రౌడీ దేవరకొండ తీరు మారింది. అతడు హైదరాబాద్ కంటే ముంబైలోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుండడం రకరకాల స్పెక్యులేషన్స్ కి దారి తీస్తోంది. అసలింతకీ విజయ్ ముంబైలోనే ఎందుకు గడుపుతున్నాడు? అతడు హిందీ సినిమా చేసేందుకే వెళుతున్నాడా? అంటూ అభిమానుల్లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే నేటి ఉదయం అతడి ఫోటోషూట్ ఒకటి రివీల్ కావడంతో కొంత క్లారిటీ వచ్చింది. మనీష్ మల్హోత్రా ఇంట్లో జరిగిన ఓ ఫోటోషూట్ లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. తనతో పాటే ముంబై బ్యూటీ కియరా అద్వాణీ ఈ షూట్ లో పాల్గొనడం ఆసక్తిని పెంచింది. వీళ్లతో పాటే ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ప్రత్యక్షమవ్వడంతో ఒకవేళ రౌడీ-కియరా జోడీగా ఏదైనా బాలీవుడ్ సినిమా ఖాయమైందా? అంటూ సందేహాలు వ్యక్తం అయ్యాయి.
అయితే అతడు ప్రఖ్యాత కాస్ట్యూమ్ బ్రాండ్ మెబాజ్ కి అంబాసిడర్ గా పని చేస్తున్నాడు. దానికోసమే అతడు ముంబైకి వెళ్లాడు. అక్కడ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్ లో ఫోటోషూట్లు చేశారట. ఈ సందర్భంగా రకరకాల సందేహాలకు అతడు క్లారిటీ ఇచ్చేశాడు. హిందీ పరిశ్రమలో సినిమా చేయడం అన్నది టాలీవుడ్ కెరీర్ కి పొడిగింపు మాత్రమేనని అతడు చెబుతున్నాడు. అలాగే పాన్ ఇండియా స్టార్ అవ్వాలన్న కోరిక ఉందని అయితే అందుకు సమయం పడుతుందని అన్నాడు. బాలీవుడ్ కి వెళ్లినా టాలీవుడ్ ని వదిలే ప్రసక్తే లేదని అతడు క్లారిటీనిచ్చాడు.
దేవరకొండ నోట మరో మాట బలంగా వినిపించింది. ఒకవేళ రీమేక్ సినిమాల్లో నటించాలనుకుంటే తాను నటించిన సినిమాల్ని వేరే భాషల్లో తీస్తే మాత్రం పొరపాటున కూడా నటించనని అలా నటిస్తే అది మరణంతో సమానమని వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి హిందీలో అతడు డియర్ కామ్రేడ్ రీమేక్ అస్సలు చేయడనే అర్థమవుతోంది. హిందీలో ఒరిజినల్ కథతో మాత్రమే నటిస్తానని ఇప్పటికే క్లారిటీనిచ్చాడు కూడా.