Begin typing your search above and press return to search.
మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన దేవరకొండ...!
By: Tupaki Desk | 3 May 2020 9:50 AM GMT'అర్జున్ రెడ్డి' అనే సినిమాతో ఒక్కసారిగా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించిన దేవరకొండ.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి మూవీతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత 'గీత గోవిందం'తో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు వరుసగా ప్లాపులు రావడంతో కొంచెం వెనుకబడిపోయాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫైటర్' సినిమాలో నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్ లో తొలి ప్యాన్ ఇండియా సినిమా అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని కరణ్ జోహార్ - ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'ఫైటర్' ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగ్ కి బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. 'డియర్ కామ్రేడ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు దెబ్బ తినడంతో 'ఫైటర్'పైనే ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ.
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన దేవరకొండ ఫైటర్ సినిమా గురించి.. నెక్స్ట్ రాబోయే సినిమాల గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో 'ఫైటర్' బాక్సింగ్ సినిమా కాదని.. మార్షల్ ఆర్ట్స్ కలిసి నడుస్తుందని చెప్పాడట. పూరితో సినిమా చాలా క్రేజీగా ఉంటుందని.. అది ఒక పండగ లాంటి సినిమా అని.. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని విజయ్ అన్నాడు. ఇక ఫైటర్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయడం గురించి అడిగితే.. తాను ఏదో ట్రై చేస్తున్నానని.. అయితే సిక్స ప్యాక్ వస్తుందో లేదో మాత్రం చెప్పలేనని అన్నాడు. అంతేకాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడు అన్న వార్త నిజమేనని.. కాకపోతే అందరూ అనుకున్నట్లు ఆ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజు కాదని వివరించాడు. అయితే దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా ఉంటుందని.. శివ నిర్వాణ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆయనతో సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అయితే ఆ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయంలో విజయ్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో నటించడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని.. ఇప్పటికే స్టోరీ డైరెక్టర్ ఖరారయ్యారని చెప్పాడు. ఇప్పుడే ఆ వివరాలు వెల్లడిస్తే మజా ఉండదన్న విజయ్.. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా 'ఫైటర్' సినిమా తర్వాత మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ దేవరకొండ లైన్ లో పెట్టాడని క్లారిటీ అయితే వచ్చింది.