Begin typing your search above and press return to search.
విజయ్ ఖర్చు గురించి పెద్ద చర్చే నడుస్తుందే!
By: Tupaki Desk | 1 Nov 2019 2:59 PM GMTనిర్మాతగా ఓ సినిమా చేయడం అంటే అది ఆశా మాషీ వ్యవహారం కాదు. ఇప్పటికే తెలుగులో మన హీరోలు కూడా నిర్మాణంలో వేలు పెట్టి కాల్చుకున్నారు. హీరో నుండి నిర్మాతగా మరి సక్సెస్ అయింది కొందరు మాత్రమే. అయితే 'మీకు మాత్రమే చెప్తా' అనే కాన్సెప్ట్ మూవీతో విజయ్ నిర్మాణంలోకి దిగాడు. ఎవ్వరికీ తెలియకుండా పెద్దగా హడావుడి చేయకుండా ముగించేసాడు.
ఇక రిలీజ్ కి ముందు మాత్రం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసేశాడు. శాటిలైట్ రైట్స్ తో పాటు డిజిటల్ కూడా అమ్మేశాడు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. కానీ ఈ రోజు సినిమా చూసిన అందరూ విజయ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి గట్టిగా చెప్పుకుంటున్నారు. ఓ షార్ట్ ఫిలిం కి అలాగే వెబ్ సిరీస్ కి పెట్టినట్లు ఖర్చు పెట్టాడని అందువల్లే సినిమా మేకింగ్ చీప్ గా ఉందని పెదవి విరుస్తున్నారు. దర్శకుడికి విజయ్ నుండి కావాల్సిన బడ్జెట్ అందలేదనే విషయం సినిమా చూస్తే తెలిసిపోతుంది. అందువల్ల ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువగా అనిపించింది.
రిలీజ్ కి ముందు ఇప్పటి వరకూ తన రెమ్యునరేషన్ లో డెబ్బై శాతం పెట్టేసానని గొప్పగా చెప్పిన విజయ్ మాటలు సినిమా చూసాక గుర్తుచేసుకుంటూ రౌడీ ఇన్నేళ్ళు హీరోగా తీసుకున్న రెమ్యునరేషన్ తక్కువే అని సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ కామెంట్ ను విజయ్ ఎలా తీసుకుంటాడో నెక్స్ట్ సినిమాను ఎలాంటి వాల్యూస్ తో ప్రొడ్యూస్ చేస్తాడో చూడాలి.