Begin typing your search above and press return to search.
'నోటా' ఫ్లాప్ పై ఫ్యాన్స్ కు దేవరకొండ లెటర్
By: Tupaki Desk | 10 Oct 2018 3:30 AM GMT‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలు మూడు విభిన్నమైన జోనర్ లో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించాయి. విజయ్ దేవరకొండ ఈ మూడు చిత్రాలతో తెలుగులో టాప్ హీరోగా మారిపోయిన విషయం తెల్సిందే. టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకున్న దేవరకొండ ‘నోటా’తో తమిళనాట తన అదృష్టంను పరీక్షించుకున్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నోటా’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తెలుగులో విజయ్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ అయితే దక్కాయి. కాని రెండవ రోజు నుండే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. సినిమా ఫ్లాప్ అని తేలిపోయింది.
‘నోటా’కు ఫ్లాప్ టాక్ వచ్చిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ తో పాటు యాంటీ ఫ్యాన్స్ కు ఓపెన్ లెటర్ రాసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ లెటర్ లో... నోటా చిత్రాన్ని చేసినందుకు గర్వపడుతున్నాను, ఈ చిత్రం ఫెయిల్యూర్ బాధ్యత మొత్తం తనదే. ఈ చిత్రాన్ని ఆధరించిన ప్రేక్షకుల ప్రేమను స్వీకరిస్తున్నాను. ఇదే సమయంలో నోటాపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారి కామెంట్స్ ను కూడా సీరియస్ గా తీసుకుంటున్నాను. తప్పకుండా వాటిని పరిశీలించి, తర్వాత సినిమాకు జాగ్రత్తలు తీసుకుంటాను. నా వైపు నుండి ఉన్న తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఒక ఫ్లాప్ వచ్చినంత మాత్రాన నా యాటిట్యూడ్ లో మార్పు ఉండదు. ఒక విజయమో లేదా అపజయమో రౌడీని తయారు చేయలేదు లేదా పడగొట్టలేదు. రౌడీ అంటే కేవలం గెలవడం మాత్రమే కాదనేది నా అభిప్రాయం. నా అభిప్రాయంలో రౌడీ అంటే విజయం కోసం పోరాడే వ్యక్తి. రౌడీలు అయినందుకు మనం గర్వపడదాం, గెలుపు కోసం పోరాటం చేద్దాం. గెలుస్తే మంచిది, లేదంటే ఏదైనా విషయం నేర్చుకుంటాం, ప్రయత్నం మాత్రం ఆపేయం. నా ఫెయిల్యూర్ ను ఎంజాయ్ చేస్తున్న వారికి ఇదే మంచి సమయం, పండగ చేసుకోండి. మరోసారి ఇలాంటి ఛాన్స్ మీకు రాదేమో, మరో సినిమాతో వెంటనే మీ ముందుకు వస్తాను అన్నాడు.
విజయ్ ఈ సందర్బంగా తెలుగు మీడియాపై ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లుగా అనిపించింది. జాతీయ మీడియాకు, తమిళ మీడియాకు ‘నోటా’ సమయంలో సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పిన విజయ్ తెలుగు మీడియా విషయంలో మాత్రం కాస్త తక్కువ మాట్లాడాడు. ‘నోటా’ ఫ్లాప్ అయినా ఆ తర్వాత సినిమాతో మళ్లీ ఒక మంచి విజయాన్ని ఫ్యాన్స్ కు ఇస్తాను అనే నమ్మకంతో విజయ్ దేవరకొండ ఉన్నాడు. త్వరలో ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ఈయన రాబోతున్న విషయం తెల్సిందే.