Begin typing your search above and press return to search.

దురదృష్టకరం అంటూ విజయ్‌ దేవరకొండ సానుభూతి

By:  Tupaki Desk   |   20 Sept 2019 3:33 PM IST
దురదృష్టకరం అంటూ విజయ్‌ దేవరకొండ సానుభూతి
X
వరుణ్‌ తేజ్‌.. అథర్వ ముఖ్య పాత్రల్లో హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన గద్దలకొండ గణేష్‌(వాల్మీకి) చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుండి కూడా టైటిల్‌ విషయమై వివాదం కొనసాగుతోంది. సినిమాకు సెన్సార్‌ క్లియరెన్స్‌ వచ్చిన నేపథ్యంలో ఇబ్బంది లేకుండా విడుదల చేసుకోవచ్చు అనుకున్నారు. కాని బోయ సంఘం వారు టైటిల్‌ మార్చాల్సిందే అంటూ పట్టుబట్టడంతో పాటు కోర్టుకు వెళ్లడంతో చిత్ర యూనిట్‌ సభ్యులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆ కారణంగా రాత్రికి రాత్రి టైటిల్‌ ను వాల్మీకి నుండి 'గద్దలకొండ గణేష్‌'గా మార్చేసిన విషయం తెల్సిందే.

టైటిల్‌ వివాదం కారణంగా ఏపీలో కొన్ని చోట్ల షోలు ఆలస్యం అవ్వడంతో పాటు రకరకాల ఇబ్బందుల తలెత్తాయి. చిత్ర యూనిట్‌ సభ్యులకు సినీ వర్గాల వారు బాసటగా నిలిచారు. సినిమాలపై ఇలాంటి స్టేలు.. తీర్పులు సబబు కాదు అంటూ సోషల్‌ మీడియాలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్‌ విషయమై రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు. టైటిల్‌ మార్పు విషయం దురదృష్టకరం అంటూ విజయ్‌ తన సానుభూతిని చిత్ర యూనిట్‌ సభ్యులకు తెలియజేశాడు.

సినిమాకు ఇలా జరగడం చాలా దురదృష్టకరం. అయినా కూడా సినిమాను ప్రేక్షకులు థియేటర్స్‌ లో ఎంజాయ్‌ చేస్తున్నారు. దర్శకుడు హరీష్‌ శంకర్‌ కు వరుణ్‌ తేజ్‌ కు నా సపోర్ట్‌ తో పాటు నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు. గద్దలకొండ గణేష్‌ అనే టైటిల్‌ కూడా మాస్‌ ఆడియన్స్‌ ను అలరించే విధంగా బాగుంది. కాని విడుదల ముందు ప్రకటించడంతో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నేడు సాయంత్రం వరకు పూర్తిగా ఆ సమస్యలు క్లీయర్‌ అవ్వొచ్చు. ఇప్పటికే విడుదలైన సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. పూర్తి స్థాయి ఫలితం సాయంత్రం వరకు క్లారిటీ రానుంది.