Begin typing your search above and press return to search.
'అర్జున్ రెడ్డి' తో పోలిక రౌడీ ఏమన్నాడంటే?
By: Tupaki Desk | 11 Feb 2020 10:00 AM GMTకొందరు హీరోలకు తమ క్లాసిక్ సినిమాలు అనుకోని శాపంగా మారుతుంటాయి. తన నుండి అదే జోనర్ లో ఇంకో సినిమా వస్తే చాలు ఉన్నపళంగా అందరూ ఆ క్లాసిక్ సినిమాతో పోలుస్తూ కంపేరిజన్ స్టార్ట్ చేస్తాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ విషయంలో అదే జరుగుతుంది. లవ్ స్టోరీతో ఏ సినిమా చేసినా రౌడీని అర్జున్ రెడ్డి క్యారెక్టర్ తో పోలుస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ మాట్లాడాడు విజయ్.
నా సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ - ట్రైలర్ ఇలా ఏదొచ్చినా 'అర్జున్ రెడ్డి' తో పోలుస్తుంటారు. దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా. నేను గెడ్డం పెంచితే అందరికీ 'అర్జున్ రెడ్డి' నే గుర్తొస్తుంది. 'అర్జున్ రెడ్డి' ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. అందుకే ఆడియన్స్ మైండ్ లో ఎప్పుడూ ఆ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఓ లవ్ ట్రాక్ 'అర్జున్ రెడ్డి' ను పోలి ఉంటుంది. కానీ సేం ఉండదు. ఏదైనా ఫ్లాప్ మూవీ తో పోలిస్తే బాధ పడాలి. పోలుస్తుంది నా సూపర్ హిట్ సినిమాతోనే కాబట్టి ఏం ఫరక్ పడదు. సంతోషంగానే ఉందని చెప్పుకున్నాడు.
ఇక తనని సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారి గురించి కూడా మాట్లాడాడు విజయ్. సోషల్ మీడియాలో నా మీద మీమ్స్ తో చేసే ట్రోల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తా. వాళ్ళు నా గురించి టైం తీసుకొని వీడియో లేదా ఫోటో ఎడిట్ చేస్తున్నారంటే నా మీద ప్రేమతోనే అని భావిస్తాను. సో నేను ఎప్పుడూ వాళ్ళ మైండ్ లో ఉంటున్ననందుకు ఫీలింగ్ హ్యాపీ అంటూ తెలిపాడు. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ తో సిక్సర్ కొట్టాలని చూస్తున్నానని బాల్ ఇంకా పైనే ఉందని , అది గ్రౌండ్ దాటి బయట పడుతుందా లేదా గ్రౌండ్ లోనే పడి ఎవరినా క్యాచ్ పడతారా చూడాలంటూ రిజల్ట్ గురించి తనలో మాట బయట పెట్టాడు.