Begin typing your search above and press return to search.
రౌడీ మళ్ళీ ట్రాక్ ఎక్కుతాడా?
By: Tupaki Desk | 25 Dec 2019 7:00 AM ISTఈ ఏడాది 'డియర్ కామ్రేడ్' తో ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ చవిచూసాడు విజయ్. ఏదో ఊహిస్తే మరేదో చూపించి ఆకట్టుకోలేకపోయాడు. అయితే వెంటనే మరో సినిమా కమిట్ అవ్వకుండా పూర్తి చేసిన సినిమా ఆడకపోవడంతో ఇప్పుడు వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
వాటిలో ఒకటి 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఆల్మోస్ట్ చివరికొచ్చేసింది. ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ సూపర్ హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత పూరి తో 'ఫైటర్' చేస్తున్నాడు. ఎంత లేదన్నా 'వరల్డ్ ఫేమస్ లవర్' రిజల్ట్ ఎఫెక్ట్ ఫైటర్ పై పడుతుంది. అందుకే రిలీజ్ డేట్ విషయంలో కూడా ఎటువంటి తొందరపడటం లేదు.
ఇక ఫైటర్ తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ మూడు సినిమాలతో మళ్ళీ ఎలాగైనా మార్కెట్ పెంచుకొని తన ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని చూస్తున్నాడు. మరి రౌడీ ప్లాన్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.