Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : పిల్లలతో రౌడీ బ్రదర్స్ బోర్డ్‌ గేమ్స్‌

By:  Tupaki Desk   |   24 Sept 2019 5:31 PM IST
ఫోటో స్టోరీ : పిల్లలతో రౌడీ బ్రదర్స్ బోర్డ్‌ గేమ్స్‌
X
తెలుగు రొమాంటిక్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ అతి త్వరలో 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈయన నటించిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించక పోవడంతో తదుపరి చిత్రం కోసం రౌడీ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే విడుదలైన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం ఫస్ట్‌ లుక్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ చిత్రం షూటింగ్‌ తో విజయ్‌ దేవరకొండ బిజీగా ఉండి ఉంటాడని అనుకుంటుండగా తాజాగా ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటో చర్చనీయాంశం అయ్యింది.

చుట్టు పిల్లలు మరియు తమ్ముడితో కలిసి విజయ్‌ దేవరకొండ బోర్డ్‌ గేమ్‌ ఆడుతూ ఉన్నాడు. విజయ్‌ తన ఇంట్లో పిల్లలతో కలిసి బోర్డ్‌ గేమ్‌ ఆడుతున్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో విజయ్‌ దేవరకొండ క్లీన్‌ షేవ్‌ తో ఉండటంతో పాటు అర్జున్‌ రెడ్డి తరహా హెయిర్‌ స్టైల్‌ తో ఉన్నాడు. అంతా చాలా సీరియస్‌ గా గేమ్‌ లో లీనమైనట్లుగా ఈ ఫొటోలో చూడవచ్చు. విజయ్‌ దేవరకొండ చాలా బిజీగా ఉంటాడు. అలాంటి విజయ్‌ దేవరకొండను కూర్చోబెట్టి గేమ్‌ ఆడిస్తున్న ఈ పిల్లలు ఎవరై ఉంటారా అనే చర్చ జరుగుతోంది.

కొందరు పిల్లలు ఇంటికి వచ్చారు.. వారితో బోర్డ్‌ గేమ్స్‌ ఆడినట్లుగా విజయ్‌ దేవరకొండ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టాడు. ఒక వైపు హీరోగా మరో వైపు నిర్మాతగా కూడా విజయ్‌ దేవరకొండ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. విజయ్‌ దేవరకొండ నిర్మాణంలో మొదటి చిత్రం మీకు మాత్రమే చెప్తా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే సమయంలో పూరితో కూడా విజయ్‌ సినిమాకు సిద్దం అవుతున్నాడు.