Begin typing your search above and press return to search.
నలుగురిని ప్రేమిస్తే వరల్డ్ ఫేమస్సా?
By: Tupaki Desk | 15 Dec 2019 4:59 AM GMTఆంథాలజీ పేరుతో నాలుగు కథల్ని మిక్స్ చేసి ఒక సినిమాగా చూపించడం చూస్తున్నదే. వెబ్ సిరీస్ లకు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. అయితే నాలుగు కథల్లో నలుగురు కథానాయకులు.. కథానాయికలు కనిపిస్తున్నారు. అయితే నాలుగు కథల్లోనూ ఒకే హీరో నలుగురు హీరోయిన్లు కనిపిస్తే.. నాలుగు డిఫరెంట్ కాలాదుల్లో నాలుగు డిఫరెంట్ లొకేషన్లలో నాలుగు ప్రేమకథల్ని వండి వారిస్తే.. అదే `వరల్డ్ ఫేమస్ లవర్` అయ్యుండొచ్చా? అంటూ కొత్తగా ఓ డిస్కషన్ మొదలైంది.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న `వరల్డ్ ఫేమస్ లవర్` రెగ్యులర్ పోస్టర్లతో రకరకాల సందేహాలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే ముగ్గురు అమ్మాయిలతో ప్రేమికుడిగా ఉన్న విజయ్ దేవరకొండ పోస్టర్లను విడివిడిగా రోజుకొకటి చొప్పున రివీల్ చేశారు. ఇక మరో ప్రేమకథకు సంబంధించిన పోస్టర్ నేడు రిలీజ్ కానుంది. ఐశ్వర్యా రాజేష్ తో సీనయ్య ప్రేమకథ... ప్యారిస్ లో ఇజబెల్లె లియెట్ తో ప్రేమకథ.. కేథరిన్ థ్రెసాతో కార్మిక నాయకుడు శ్రీను ప్రేమకథకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. రాశీఖన్నాతో ప్రేమకథ ఏమిటి? అన్నది రివీల్ కావాల్సి ఉంది.
అసలింతకీ ఇందులో ఒకే లవర్ బోయ్ నలుగురు అమ్మాయిల్ని ప్రేమిస్తాడా? లేక ఏ ఒక్క కథకు సంబంధం లేకుండా నాలుగు డిఫరెంట్ లవ్ స్టోరీల్ని చూపిస్తున్నారా? అన్న సస్పెన్స్ అభిమానుల్ని నిలవనీయడం లేదు. కొందరైతే ఒక లవ్ స్టోరీలో ఇద్దరితో రొమాన్స్.. ఇంకో లవ్ స్టోరీలో మరో ఇద్దరితో రొమాన్స్ అంటూ రకరకాలుగా ఊహిస్తున్నారు. అయితే ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? ఆంథాలజీ తరహా ప్రేమకథల్లో ఒకే హీరోతో ప్రయోగమా? అన్నది తెలియాలంటే చిత్రబృందం స్పందించాల్సి ఉంది. 2020 ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం రిలీజ్ కానుంది.