Begin typing your search above and press return to search.
కరణ్ తో హాట్ పెయిర్.. అసలేం జరుగుతోంది?
By: Tupaki Desk | 9 Sep 2019 9:55 AM GMTగత కొంతకాలంగా రౌడీ వ్యవహారం ఏదో తేడా కొడుతోందన్న చర్చ సాగుతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వైపు విజయ్ దేవరకొండ అడుగులు వేస్తున్నారంటూ ప్రచారం వేడెక్కిస్తోంది. ఇది నిజమేనా? అని రౌడీనే ప్రశ్నిస్తే .. బాలీవుడ్ కి వెళుతున్నాను అని కానీ.. వెళ్లను అని కానీ కన్ఫామ్ గా అయితే చెప్పలేదు. అక్కడ ఎవరైనా తనకు కథ వినిపిస్తే.. అది సూటయితే .. కాంబినేషన్ కలిసొస్తే నటించే వీలుంది అన్న హింట్ అయితే ఇచ్చాడు. వెంటనే హిందీలో సినిమా చేసేయాలన్న కంగారు అయితే లేదని క్లారిటీనిచ్చాడు.
అంతవరకూ ఓకే కానీ.. ఉన్నట్టుండి ఇలా బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంటి నుంచి విజయ్ దేవరకొండ - కియరా అద్వాణీ జంట అలా బయటికొస్తూ దొరికిపోయారేమిటో. వీళ్లతో పాటు దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా కనిపించడంతో ఏదో జరుగుతోందన్న సందేహం కలుగుతోంది. ఏదో ఓ సాంప్రదాయక ఫోటోషూట్ కోసం ముంబైలో కలిశారు! అని చెబుతున్నా రౌడీ ఫ్యాన్స్ లో రకరకాల సందేహాలు అలుముకున్నాయి.
మనీష్ మల్హోత్రా సారథ్యంలో ఆ ఇద్దరూ ఫోటోషూట్ లో పాల్గొన్నారు. అయితే అది దేనికోసం? అన్నది ఇంకా సస్పెన్స్. ఇక ఆ పని ముగించుకుని తిరిగి బయటికి వచ్చేప్పుడు మాత్రం విజయ్ సాంప్రదాయ సూట్ ధరించి చాలా రాయల్ గా కనిపించాడు. బ్లూ కలర్ సూట్.. బ్లాక్ జాగర్స్ లో సింపుల్ గా కనిపించాడు. కియరా సంథింగ్ స్పెషల్ గా కనిపించింది. బూడిద రంగు జంప్ సూట్ పై వైట్ లూజ్ షర్ట్ ధరించింది. పిక్కల దిగువ భాగాన్ని ఎగ్జిబిషన్ కి పెట్టిన కియరా కుర్రాళ్లకు కంటిపై కునుకు పట్టనీకుండా టూ హాట్ గానూ కనిపించింది. ఆ ఇద్దరితో పాటు కరణ్ డెనిమ్స్ పైన ప్రింటెడ్ రెడ్ జాకెట్ ధరించి టింగురంగడిలా కనిపించాడు. మనీష్ మల్హోత్రా ఇంటి నుంచి బయటికి వస్తుండగా కెమెరా కంటికి చిక్కారు. అసలింతకీ ఈ ఫోటోషూట్ దేనికి? కరణ్ తో సినిమా ఏదైనా ఖాయం చేసుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.