Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ సుధామూర్తి పొగిడిన ఏకైక హీరో

By:  Tupaki Desk   |   9 Feb 2020 4:01 PM GMT
ఇన్ఫోసిస్ సుధామూర్తి పొగిడిన ఏకైక హీరో
X
సినిమా వాళ్లపై అదే ఇండ‌స్ట్రీ వాళ్ల ప్ర‌శంస‌లు ఓకే. రాజ‌కీయ నాయ‌కుల ప్ర‌శంస‌లు స‌రే. కానీ బిజినెస్ ఫ్యామిలీస్.. కార్పొరెట్లు.. ఎంట‌ర్ ప్రెన్యూర్ ఫ్యామిలీస్ నుంచి ఎవ‌రైనా ప్ర‌ముఖులు పొగిడేయ‌డం అన్న‌ది అరుదుగానే చూస్తుంటాం. కానీ అలా అరుదైన ప్ర‌శంస‌ను అందుకున్నాడు రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఒక అరుదైన వ్య‌క్తి నుంచి అంతే అరుదైన ప్ర‌శంస ద‌క్కింది.

ఇంత‌కీ త‌న‌ని పొగిడేసింది ఎవ‌రు? త‌న‌ని అభిమానించి దానికి బ‌హిరంగంగా చెప్పిన ఆ కార్పొరెట్ దిగ్గ‌జం ఎవ‌రు? అంటే.. ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ సుధామూర్తి ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ ట్రీట్ ఇది. 69 ఏళ్ల సుధామూర్తి విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన సినిమాల్ని ఎంతో అభిమానంగా చూస్తార‌ట‌. గీత గోవిందం సినిమా చూసి త‌న‌కు అభిమానిగా మారార‌ట‌. ఆ సినిమా త‌న‌కు ఎంతో న‌చ్చింద‌ని అన్నారు.

పెళ్లి చూపులు స‌మ‌యం నుంచే విజ‌య్ పాపులారిటీ అసాధార‌ణంగా పెరిగింది. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. అర్జున్ రెడ్డితో ఏకంగా పది మెట్లు ఎక్కాడు. అటు బాలీవుడ్ లోనూ త‌న‌కు వీరాభిమానులు ఏర్ప‌డ్డారు. బాలీవుడ్ యువ‌నాయిక‌లు మ‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ విజ‌య్ పై మ‌న‌సు పారేసుకుంటున్నారు. ఇక విజ‌య్ న‌టించిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ రిలీజ్ కి రెడీ అవుతున్న వేళ అత‌డి ఫోక‌స్ మ‌రింత ఎక్కువగా ఉంది. రౌడీపై గాళ్స్ ఫోక‌స్ మ‌రీ ఎక్కువ‌గానే ఉంటుంద‌న‌డంలో సందేహమేం లేదు. ఫిబ్ర‌వ‌రి 14న ఈ సినిమా రిలీజ‌వుతోంది. ఈసారి రిజ‌ల్ట్ ఎలా ఉండ‌బోతోందోనన్న ఆస‌క్తి ఇప్ప‌టికే రౌడీ ఫ్యాన్స్ లో నెల‌కొంది. ఆదివారం సాయంత్రం ప్రీరిలీజ్ వేడుక‌లో విజ‌య్ సంద‌డి ఓ రేంజులోనే ఉంది.