Begin typing your search above and press return to search.

ఆ అమ్మాయి ఎవ‌రు దేవ‌ర‌కొండ‌!

By:  Tupaki Desk   |   21 Aug 2018 5:41 AM GMT
ఆ అమ్మాయి ఎవ‌రు దేవ‌ర‌కొండ‌!
X
ఏడేళ్ల క్రితం చిన్న‌పాత్ర‌.. మూడేళ్ల క్రితం హీరో స్నేహితుడి పాత్రను పోషించిన ఒక కుర్రాడు.. అప్పుడు ప‌వ‌న్‌.. ఇప్పుడు అత‌నే అన్నంత ఇమేజ్ సొంతం చేసుకోవ‌టం సాధ్య‌మేనా? ఈ సినిమాతో స్టార్ట స‌ర‌స‌న చేరిపోయాడు.. ఇక‌పై నువ్వు స్టార్ హీరో అంటూ మెగాస్టార్ చిరంజీవి అంత‌టి వ్య‌క్తి అంద‌రి ఎదుట పొగిడేయ‌టం సాధ్య‌మేనా?. అంతెందుకు.. అప్ప‌ట్లో నా ఖైదీ.. ఇప్ప‌టి నీ సినిమా అంటూ చిరు నోటి నుంచి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించుకోవ‌టం సాధ్య‌మేనా? అంటే నో చెప్పేస్తారు.

రీల్ లైఫ్ లో త‌ప్పిస్తే..రియ‌ల్ లైఫ్ లో సాధ్యం కాదంటారు కానీ.. అదేమీ అసాధ్యం కాద‌ని చేత‌ల్లో నిరూపించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మూడేళ్ల కింద‌ట ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంలో హీరో నాని స్నేహితుడిగా న‌టించిన విజ‌య్ క్రేజ్ ఇప్పుడు ఎంత‌న్న‌ది తెలిసిందే.

రెండు..మూడు సినిమాల‌తో త‌న ఇమేజ్ ను భారీగా పెంచేసుకున్న అత‌గాడి తాజా చిత్రం గీతాగోవిందం. విడుద‌లకు ముందు లీకు దెబ్బ‌కు విజ‌య్ కంట క‌న్నీరు కార్చేలా చేసిన‌ప్ప‌టికీ.. ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత అయిన హిట్ రేంజ్ కు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఈ సినిమాను ప్ర‌క‌టించిన నాటి నుంచి పాజిటివ్ బ‌జ్ ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడొచ్చిన స‌క్సెస్ ను మాత్రం అంచ‌నా వేయ‌లేద‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుద‌ల అనంత‌రం ఒక మీడియా సంస్థ‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాలు మాట్లాడిన అత‌గాడు.. ఒక అమ్మాయిని దేవ‌త‌గా అభివ‌ర్ణించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కూ ఆ అమ్మాయి ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మీకు ప‌రిచ‌య‌మైన అమ్మాయిల్లో అమ్మాయి అంటే ఇలా ఉండాల్రా? అనిపించిన అమ్మాయి ఎవ‌రైనా ఉన్నారా? అన్న ప్ర‌శ్న‌కు విజ‌య్ స్పందిస్తూ.. అమ్మాయి అంటే ఇలా ఉండాల‌ని తాను అనుకోన‌ని చెబుతూ.. ఒక్కొక్క‌రికి ఒక్కో స్టైల్ ఉంటుంద‌న్నారు. త‌న జీవితంలో ఒక అమ్మాయి ఉంద‌ని.. తాను న‌టుడు కాక ముందు నుంచి ఆమె ప‌రిచ‌య‌మ‌ని చెప్పారు.

అన్ని విష‌యాల్లో త‌న‌ను చాలా ప్రోత్స‌హించింద‌ని.. మిగిలిన అమ్మాయిల విష‌యం తాను చెప్ప‌లేను కానీ.. ఆ అమ్మాయి మాత్రం త‌న‌కు దేవ‌త‌న్నాడు. ఆమె చుట్టుప‌క్క‌ల ఉన్న వారంతా అదృష్ట‌వంతులుగా పొగిడేశాడు. ఇప్పుడంతా విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి మాట్లాడుతుంటే.. అత‌గాడు చెప్పిన అమ్మాయి ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.