Begin typing your search above and press return to search.
వారికి సారీ చెప్పడం ఏంది గోవిందా?
By: Tupaki Desk | 24 Nov 2018 5:22 PMవిజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ ఊహించని రీతిలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ట్యాక్సీవాలా ఒక మామూలు సినిమా నిలిచినా చాలని - పెట్టుబడి వెనక్కు వస్తే చాలని చిత్ర యూనిట్ సభ్యులు అనుకుని ఉంటారు. ఎందుకంటే సినిమా విడుదలకు ముందు పరిస్థితి మరీ దారుణం. అసలు సినిమా విడుదల అయ్యేది అనుమానమే అన్నట్లుగా పరిస్థితి ఏర్పడినది. విడుదలకు మూడు నెలల ముందే మొత్తం సినిమా పైరసీ అవ్వడం - ఈ చిత్రం కథను పోలి తమిళంలో ‘డోర’ అనే చిత్రం రావడం జరిగింది. ఒక సినిమా ఎలాంటి కష్టాలు - ఇబ్బందులు ఎదుర్కోకూడదో ఆ కష్టాలన్నీ ట్యాక్సీవాలా ఎదుర్కొంది.
అలాంటి పరిస్థితుల నుండి వచ్చిన ‘ట్యాక్సీవాలా’ మొదటి వారంలో ఏకంగా 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు - మాట్లాడిన మాటలు కాస్త విభిన్నంగా - విచిత్రంగా అనిపించింది. విజయం సాధించిన ఫీలింగ్ దేవరకొండలో క్లీయర్ గా కనిపించడంతో పాటు, అతడి బాడీ లాంగ్వేజ్ లో విజయోత్సాహం కనిపించింది. ఇక సక్సెస్ వేడుకలో మాట్లాడుతూ సినిమాను పైరసీ చేసిన వ్యక్తులకు సారీ చెప్పాడు.
ట్యాక్సీవాలా విడుదలకు ముందు తమ సినిమాను పైరసీ చేసిన వారికి - పైరసీ చూసి బ్యాడ్ రివ్యూలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారికి పలు ఇంటర్వ్యూలో అసభ్యంగా మిడిల్ ఫింగర్ ను దేవరకొండ చూపించాడు. అప్పుడు తాను చేసిన పనికి తాజా సక్సెస్ మీట్ లో సారీ చెప్పాడు. వారు పైరసీ చేయడం వల్ల సక్సెస్ అయ్యిందని అనుకున్నాడో లేక మరేంటో కాని వారికి సారీ చెప్పి చర్చకు తెర లేపాడు. ఆయన అభిమానులు కూడా వారికి సారీ చెప్పడం ఏంటీ గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దేవరకొండ ఏం చేసినా విభిన్నంగా ఉంటుందని మరోసారి నిరూపించుకున్నాడు.